గూండాయిజంతో రాజకీయాలు సాగవు | - | Sakshi
Sakshi News home page

గూండాయిజంతో రాజకీయాలు సాగవు

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

గూండాయిజంతో రాజకీయాలు సాగవు

వెన్నుపోటు నాయకుడికి అక్రమ గెలుపుపైనే మోజు చంద్రబాబు పాలనపై విసుగెత్తుతున్న ప్రజలు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి

యర్రగొండపాలెం: గూండాయిజంతో రాజకీయాలు సాగవని, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆ వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని అరాచకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే పచ్చ నేతలు పనిగా పెట్టుకున్నారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. త్రిపురాంతకంలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు చేసి అక్రమ గెలుపుపైనే మోజుపెంచుకున్నాడని, ఆయన పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోతున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు గూండాయిజంచేసి ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు వేయకుండా అడ్డుకొని ఏకగ్రీవాలు చేసుకున్నారని, సిగ్గులేకుండా అన్ని స్థానాల్లో తామే గెలుపొందామని ప్రకటించుకున్నారని విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రజల ముందుకు వచ్చి గెలుపేంటో నిరూపించుకోవాలని సూచించారు. జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో అటువంటి ఆటలు సాగవని, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమ సత్తాఏంటో చూపిస్తారని వారు హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ కాలంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారని, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించి తమ నాయకుడిని ఎన్నుకున్నారని గుర్తుచేశారు. అటువంటి పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లేకుండాపోయిందని, పోలీసులే అధికార పార్టీ గూండాలతో కలిసి రిగ్గింగ్‌కు పాల్పడటం, వైఎస్సార్‌ సీపీ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులుగా విధులు నిర్వర్తించినవారు పంచాయతీ ఎన్నికల్లో సమన్వయంగా పనిచేసి పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగనన్నకు కానుకగా ఇవ్వాలని కోరారు. సమావేశంలో నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, సింగారెడ్డి పోలిరెడ్డి, రంగబాబు, భవనం కుమారి, పొన్ను లక్ష్మి, గార్లపాటి శార, పల్లె సరళ, గోపాల్‌రెడ్డి, శంబిరెడ్డి, మల్లికార్జునరావు, వెంకటేశ్వర్లు చౌదరి, ఆళ్ల కృష్ణారెడ్డి, బాలకోటిరెడ్డి, భవనం వెంకటరెడ్డి, అచ్చయ్య యాదవ్‌, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement