చివరి రోజున పోటెత్తిన నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

చివరి రోజున పోటెత్తిన నామినేషన్లు

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

చివరి రోజున పోటెత్తిన నామినేషన్లు

పొదిలి: నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మార్కాపురంలో చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. మొత్తంమీద చైర్‌పర్సన్‌ పదవికి 21, కౌన్సిలర్‌ పదవులకు 208 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున సోమవారం ఒక్కరోజే చైర్‌పర్సన్‌ పదవికి 13, కౌన్సిలర్‌ పదవులకు 172 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్టీల వారీగా పరిశీలిస్తే.. చైర్‌పర్సన్‌ పదవి కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి 10, తెలుగుదేశం పార్టీ నుంచి 8, కాంగ్రెస్‌ నుంచి 1, స్వతంత్రులు 2 నామినేషన్లు వేశారు. 28 కౌన్సిలర్‌ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ నుంచి 99, టీడీపీ నుంచి 81, జనసేన నుంచి 14, బీజేపీ నుంచి 5, సీపీఎం నుంచి 2, మరో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా, చైర్‌పర్సన్‌ పదవికి టీడీపీ తరఫున వరికుంట్ల అనిల్‌కుమార్‌ నామినేషన్‌ వేశారు.

పొదిలి చైర్‌పర్సన్‌కు 21,

కౌన్సిలర్లకు 208 దాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement