పంచాయతీలో అభ్యర్థుల వ్యయంపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలో అభ్యర్థుల వ్యయంపై దృష్టి పెట్టాలి

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

● రెండో విడత పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ ● శిక్షణలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అరకొర పెన్షన్‌తో ఎలా బతకాలి

● రెండో విడత పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ ● శిక్షణలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి

ఒంగోలు సబర్బన్‌: మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎఫ్‌ఎస్‌, ఎస్‌ఎస్‌టీ, జోనల్‌ ఆఫీసర్లు, వీడియో వ్యూయింగ్‌ టీం, ఎంసీసీ, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయాల నమోదు, పరిశీలన, పర్యవేక్షణ ముఖ్యమని జేసీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఇతర ప్రలోభాల పంపిణీని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు వివేక్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో ప్రతి అధికారి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నోడల్‌ ఆఫీసర్‌ ముప్పూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో జిల్లా ఆడిట్‌ అధికారి, సి.ఈ.ఓ, స్టెప్‌ శిక్షణలో పాల్గొన్నారు.

● కలెక్టరేట్‌ వద్ద పెన్షనర్ల ధర్నా

ఒంగోలు టౌన్‌: నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్న తరుణంలో నెలకు అరకొరగా వేయి రూపాయల పెన్షన్‌ ఇచ్చి బతకమంటే ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రాంబాబు ప్రశ్నించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పెన్షనర్ల విద్రోహదినం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ 1995లో నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈపీఎఫ్‌ పెన్షన్‌ ప్రారంభించారని తెలిపారు. కానీ నేటికీ కేవలం వేయి రూపాయలు మాత్రమే పెన్షన్‌ చెల్లిస్తున్నారని, ఇది దుర్మార్గమన్నారు. మినిమం పెన్షన్‌ రూ.9 వేలతో పాటుగా డీఏ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శేషయ్య మాట్లాడుతూ రాష్ట్ర పెన్షన్‌ దారులకు పీఆర్సీ, డీఆర్‌ బకాయిలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ కోశాధికారి బీవీ రావు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్డ్‌ అయిన వెంటనే గ్రాడ్యూటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించాలని కోరారు. ధర్నాలో అసోసియేషన్‌ నాయకులు డీ.వీరాంజనేయులు, కే.వెంకటేశ్వర్లు, వివి రత్నం, రాజేశ్వరరావు, నర్సయ్య సంజీవ్‌, ఆదిశేషగిరి రావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement