ముగిసిన నామినేషన్‌ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్‌ల పర్వం

Nov 17 2026 1:38 AM | Updated on Nov 17 2026 1:38 AM

చివరి రోజు జోరుగా నామినేషన్‌లు చైర్మన్‌ అభ్యర్థులుగా 13 మంది, కౌన్సిలర్‌లుగా 208 నామినేషన్‌లు

కందుకూరు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల ప్రక్రియ చివరి రోజైన సోమవారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్‌లు వేశారు. దీంతో నామినేషన్‌ కేంద్రాలైన పాలిటెక్నిక్‌ కాలేజీ, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద రాజకీయ సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా వైఎస్సార్‌ సీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. వైఎస్సార్‌ సీపీ తరఫున చైర్మన్‌ అభ్యర్థులుగా వల్లూరి కోటేశ్వరరావు నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ కోటేశ్వరరావుతో నామినేషన్‌ కేంద్రానికి వెళ్లి మద్దతు తెలిపారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన పిడికిటి వెంకటేశ్వర్లు నామినేషన్‌ వేశారు. వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులు సోమవారం పెద్ద సంఖ్యలో నామినేషన్‌ దాఖలు చేశారు. చైర్మన్‌ అభ్యర్థులు 13 మంది అభ్యర్థులు నామినేషన్‌లు వేయగా, 40 వార్డులకు సంబంధించి కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 208 నామినేషన్‌లు దాఖలు కావడం గమనార్హం. వీటిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు 96, టీడీపీ అభ్యర్థులు 79, బీజేపీ నుంచి 5, జనసేన 6, సీపీఎం 2, సీపీఐ 4, స్వతంత్ర అభ్యర్థులుగా 16 మంది నామినేషన్‌లు వేశారు. చైర్మన్‌ అభ్యర్థులుగా వైఎస్సార్‌ సీపీ నుంచి వల్లూరి కోటేశ్వరరావు, వల్లూరి వసంతలక్ష్మీ, పువ్వాడి వెంకట రమణయ్య, పెయ్యల రమేష్‌, నగళ్ల నారయ్య, షేక్‌ రఫి, టీడీపీ నుంచి పిడికిటి వెంకటేశ్వర్లు, పిడికిటి లావణ్య, దివి సౌభాగ్యలక్ష్మి, కాంగ్రెస్‌ నుంచి సయ్యద్‌ గౌస్‌మొహిద్దీన్‌, ఇతరులు గేరా మాధవి, షేక్‌ సుల్తాన్‌, సయ్యద్‌ నసీమా నామినేషన్‌ వేశారు.

నేడు నామినేషన్ల పరిశీలన

మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్‌లను మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్దేశిత నామినేషన్‌ కేంద్రాల్లోనే అధికారులు పరిశీలిస్తారని సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ కె అనూష తెలిపారు. పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం సరైన నామినేషన్‌లను ఆమోదిస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement