బిల్లు..ఘొల్లు..! | - | Sakshi
Sakshi News home page

బిల్లు..ఘొల్లు..!

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

పేదింటికి చంద్ర గ్రహణం..!

మార్కాపురం: ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు ఇప్పటికీ కలగానే మిగిలింది. గతంలో 2014–19 మధ్య ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు తాము అధికారంలోకి రాగానే పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17,851 గృహాలకు సంబంధించి రూ.27.64 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. దీంతో వేలాది మంది లబ్ధిదారులు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

ఇళ్లు నిర్మించుకునేందుకు అప్పులు చేసి చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకున్న లబ్ధిదారులు తమకు రావాల్సిన బిల్లుల కోసం గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు మాత్రం త్వరలోనే బిల్లులు విడుదలవుతాయని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే చెల్లింపులు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలం గడుపుతున్నారే తప్ప తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం స్పందించేదెప్పుడు..?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు బిల్లులు అందకపోవడంతో అప్పుల భారం మరింత పెరుగుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నిధులు విడుదల చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే చెల్లింపులు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా అదిగో ఇదిగో అంటూ కాలం గడుపుతున్నారే తప్ప తమ ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు మాత్రం ప్రభుత్వానికి నిధులు కోసం ప్రతిపాదన పంపాం, అవి రాగానే వారి ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌టీఆర్‌ గృహాల బిల్లులకు రెండేళ్లుగా ఎదురుచూపులే

రూ.27.64 కోట్ల బకాయిలు..

17,851 గృహాల లబ్ధిదారుల నిరీక్షణ..

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు..

అదిగో ఇదిగో అంటూ కాలయాపన

నియోజకవర్గాల వారీగా

బకాయిల వివరాలు

మార్కాపురం నియోజకవర్గం పరిధిలో 3,622 గృహాలకు రూ.4.76 కోట్లు, యర్రగొండపాలెం నియోజకవర్గంలో 4,484 గృహాలకు రూ.7.81 కోట్లు, గిద్దలూరు నియోజకవర్గంలో 5,036 గృహాలకు రూ.7.41 కోట్లు, కనిగిరి నియోజకవర్గంలో 4,709 గృహాలకు రూ.7.64 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement