గుడ్లవల్లేరు:
స్థానిక శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన జెఎన్టీయూకే స్థాయి అంతర్ కళాశాలల పోటీలు రసవత్తరంగా ఆదివారం ముగిశాయి. టోర్నమెంట్లో యూనివర్సిటీ పరిధిలో ఉన్న వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 350 మంది క్రీడాకారులు, 50 మంది ఫిజికల్ డైరెక్టర్లు, సెలక్షన్ కమిటీ మెంబర్లు హాజరయ్యారు. ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలను ప్రకటించారు. బాల్ బ్యాడ్మింటన్‌లో తృతీయ స్థానంలో పేస్ ఇంజినీరింగ్, కిట్స్ యనమదాల గెలుపొందారు. అనంతరం యూనివర్సిటీ జట్లను ఎంపిక చేశారు. బాల్ బ్యాడ్మింటన్ పురుషులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చైన్నెలో జనవరి 14–17 తేదీల్లో జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో, కబడ్డీ మహిళల టీమ్ కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నంలో జరిగే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కరుణకుమార్ తెలిపారు.
విజేతలకు బహుమతుల ప్రదానం..
పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఎస్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ సెలెక్ట్ అయిన టీమ్‌లు వినాయక మిషన్ ఫౌండేషన్ చైన్నెలో నవంబర్ 21–23 తేదీల్లో జరిగే అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొంటారని కాలేజీ ప్రిన్సిపాల్ బి.కరుణకుమార్ తెలిపారు. తొలుత ఈ పోటీలను ప్రిన్సిపాల్ కరుణకుమార్, డైరెక్టర్ పి.సిద్ధయ్య, వైస్ ప్రిన్సిపాల్ బి.కోదండ రామారావు ప్రారంభించారు. ఈ పోటీలకు అబ్జర్వర్‌గా యూనివర్సిటీ బోర్డ్ జి.శ్యామ్ కుమార్ సెక్రటరీ వ్యవహరించారు. క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి జి.శ్యామ్‌కుమార్, ప్రిన్సిపాల్ కరుణకుమార్ విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్లో సెలక్షన్ కమిటీ మెంబెర్లు, వివిధ కళాశాలల వ్యాయమ అధ్యాపకులు ఎం.శివశంకర్, డి.పూజిత, ఎస్.నాగబాబు, వి.శ్రీనివాసరావు, ఎం.భవదీప్, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


