రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

● ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: చంద్రబాబు పాలనలో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందని, అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఆ వ్యవస్థ కీలుబొమ్మగా మారిందని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పచ్చనాయకులు గూండాయిజం చేశారని, వారికి పోలీసులు వత్తాసు పలికి ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు భయపడకుండా పోలింగ్‌ సమయంలో వారి ఆగడాలను అడ్డుకున్నారని, కౌంటింగ్‌లో వచ్చిన మెజార్టీ చూసి అధికార పక్షం నాయకులకు ముచ్చెమటలు పట్టాయన్నారు. పోలీసుల అండతో రిగ్గింగ్‌లకు పాల్పడినప్పటికి అంతంత మాత్రమే వారికి మెజార్టీ వచ్చిందన్నారు. ఈ పరిస్థితులను చూస్తే జగనన్నపై ప్రజలకు ఎంత అభిమానం ఉందో తెలుస్తుందన్నారు. ఈ స్ఫూర్తితోనే జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేవరకు తమ పోరాటపటిమను కొనసాగించాలన్నారు. గెలుపు ఓటములను సమానంగా చూసుకొని ఆయా పంచాయతీల్లో పోటీ చేసేందుకు అన్ని వర్గాలకు చెందిన నాయకులు సన్నద్ధం కావాలని, పోటీ చేసే అభ్యర్థులకు వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలుస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అందరం బలంగా పార్టీకి అండగా నిలువాలన్నారు. పార్టీకి ద్రోహం చేసే నాయకులను క్షమించేది ఉండదని, వారికోసం ఆలోచనచేసి సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రజల్లోకి వెళ్లి జగనన్న ప్రభుత్వ కాలంలో జరిగిన మేలును వివరించాలని ఆయన కోరారు. సమావేశంలో పార్టీ మండల మాజీ ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, పార్టీ నాయకులు కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, వై.వెంకటేశ్వరరెడ్డి, పి.రాములు నాయక్‌, ఆర్‌.అరుణాబాయి, ఆర్యవైశ్య సంఘం నాయకులు సూరె వెంకట రమేష్‌, ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు, దొగిపర్తి సంతోష్‌ కుమార్‌, యక్కలి రాంబాబు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్‌.ఫజుల్‌, సయ్యద్‌ జబీవుల్లా, మొహమ్మద్‌ కాశిం, ఎం.కాశింబేగ్‌, షేక్‌.వలి, కాశింపీర, మునాఫ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement