వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి జెడ్పీటీసీగా విజయం సాధించిన మద్దసాని నవీన్‌కృష్ణ (ఉలవపాడు), ఎంపీటీసీ సభ్యులు ఏపూరి మాధవరావు, పిన్నెబోయిన నారాయణ, రాపూరి సువర్ణలత, కటారి భూపతి, బండి రాజమ్మ, పి.ప్రియాంక గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బుర్రాను, విజేతలను వైఎస్ జగన్ అభినందించారు.


