జనగణన పక్కాగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జనగణన పక్కాగా నిర్వహించాలి

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

జనగణన పక్కాగా నిర్వహించాలి ● రిలీజియన్‌, అంగవైకల్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి ● అధికారులతో సమీక్షలో జేసీ కల్పనా కుమారి

● రిలీజియన్‌, అంగవైకల్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి ● అధికారులతో సమీక్షలో జేసీ కల్పనా కుమారి

ఒంగోలు సబర్బన్‌: జనగణన–2027లో క్షేత్రస్థాయి సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి సూచించారు. గురువారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో మండలాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులతో సమీక్షించారు. జనగణనలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ముఖ్యంగా రిలీజియన్‌, అంగవైకల్యం వంటి వాటిపై దృష్టి సారించి సమగ్ర నివేదిక రూపొందించుకోవాలన్నారు. సెన్సస్‌–2027పై నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో చెప్పిన విషయాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా నిబంధనల మేరకు పాటించాలని సూచించారు. వివరాలు సేకరించేటప్పుడు వచ్చే సమస్యలను సున్నితంగా, సామరస్యంగా పరిష్కరించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం మండల స్థాయిలో కూడా మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారి, డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సెస్‌ ఆపరేషన్‌ జే.నివాస్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ నుంచి గుజ్జుల సంజీవరెడ్డి సస్పెన్షన్‌

మార్కాపురం: మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పొదిలి మండల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు గుజ్జుల సంజీవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయనపై ఫిర్యాదులు అందడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు సస్పెన్షన్‌ వేటు వేసినట్లు వెల్లడించారు. ఆ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం అధికారికంగా పత్రికా ప్రకటన విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement