ఇంద్రకీలాద్రిపై కలకలం.. | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై కలకలం..

Nov 14 2026 1:29 AM | Updated on Nov 14 2026 1:29 AM

15న ఎస్‌జీఎఫ్‌ బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శుక్రవారం ఓ మహిళ కొండపై నుంచి కిందపడిన ఘటన కలకలం రేపింది. దుర్గగుడి పాత మెట్ల మార్గానికి సమీపంలోని చెట్ల మధ్య గాయాలతో పడి ఉన్న మహిళను భక్తులు గుర్తించి సిబ్బందికి సమాచారం అందించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన దేశబోయిన బాలఅంజమ్మ శుక్రవారం తెల్లవారుజామున విజయవాడకు చేరుకుంది. ఉదయం 6 గంటల సమయంలో రాజగోపురం ఎదుట తిరుగుతున్న ఆమెను ఆలయ సిబ్బంది గుర్తించారు. ఉదయం 11 గంటల వేళ గోశాల, మరుగుదొడ్ల దిగువన చెట్ల మధ్య మహిళ పడి ఉన్నట్లు భక్తులు తెలపడంతో ప్రోటోకాల్‌ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గణేష్‌, మరో గార్డు, ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన నాగరాజు అక్కడికి చేరుకున్నారు. గణేష్‌, నాగరాజు చెట్ల మధ్యలోకి దిగి గాయపడిన మహిళను చేతులపై ఎత్తుకుని పైకి తీసుకొచ్చారు.

బ్యాటరీ వాహనంపై తరలింపు..

అంబులెన్స్‌ మహామండపం దిగువన ఉండటంతో సిబ్బంది ఆమెను బ్యాటరీ వాహనంపై టోల్‌గేట్‌ వరకు తీసుకెళ్లి, అక్కడి నుంచి దేవస్థానం అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాలు, నడుము భాగాల్లో గాయాలైన బాలఅంజమ్మ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఆలయ ఈవో శీనానాయక్‌ బాధితురాలి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. సాయంత్రానికి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

అనుమానాలకు తావిస్తున్న పరిణామాలు..

బట్టల బ్యాగుతో ఒంటరిగా రావడం, కొండపైనే ఆమె సెల్‌ఫోన్‌, ఆధార్‌ కార్డు లభించడం, పోలీసుల ప్రశ్నలకు ఆమె స్పష్టమైన సమాధానాలు చెప్పకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇది ప్రమాదమా లేక కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కందుకూరు రూరల్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉదయం 9 గంటలకు కందుకూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా స్థాయి బాస్కెట్‌బాల్‌ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ఎం.రాజ్యలక్ష్మి, పి.శివశంకర్‌ తెలిపారు. అండర్‌–14, 17 బాలబాలికల విభాగాల్లో నిర్వహించే ఈ ఎంపికలకు క్రీడాకారులను తీసుకురావాలని వ్యాయామోపాధ్యాయులను కోరారు.

కొండపై నుంచి కిందపడిన భక్తురాలు

ప్రమాదమా.. ఆత్మహత్యాయత్నమా?

రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించిన ఆలయ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement