వేటగాళ్ల విద్యుత్‌ ఉచ్చుకు మూడు గేదెలు బలి | - | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల విద్యుత్‌ ఉచ్చుకు మూడు గేదెలు బలి

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

హనుమంతునిపాడు: మండల పరిధిలోని హాజీపురం ఎత్తు రోడ్డు సమీప అటవీ ప్రాంతంలో విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు కీచర వెంకటేశ్వర్లు రెడ్డి శనివారం మేత కోసం అడవిలోకి తోలిన గేదెలు తిరిగి రాలేదు. అటవీ ప్రాంతంలో గాలించగా విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెంది ఉండటం కనిపించింది. అడవి పందులు, జింకల వేట కోసం వేటగాళ్లు విద్యుత్‌ లైన్ల నుంచి అక్రమంగా తీగలు లాగి అమర్చిన ఉచ్చుకు తగిలే ఈ మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షల వరకు ఉంటుందని, నిరంతరం విద్యుత్‌ తీగలు అమర్చుతున్న వేటగాళ్లపై ఫారెస్ట్‌, విద్యుత్‌ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement