దాడులతో ‘సాక్షి’ని అడ్డుకోవడం మీ తరం కాదు | - | Sakshi
Sakshi News home page

దాడులతో ‘సాక్షి’ని అడ్డుకోవడం మీ తరం కాదు

Oct 31 2026 8:07 AM | Updated on Oct 31 2026 8:07 AM

ఆత్మకూరు ‘సాక్షి’ విలేకరి సుబ్బారెడ్డి మీద టీడీపీ నాయకుల దాడిని వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల నిరసన

కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుకు వినతిపత్రం అందజేత

ప్రకాశం కలెక్టర్‌, ఎస్పీలకు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

మార్కాపురంలో కలెక్టర్‌, ఎస్‌పీకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజే నాయకులు, విలేకరులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దాడులు, దౌర్జన్యాలతో ‘సాక్షి’ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని, ఎంతగా అణచివేస్తే అంతగా ఎగిసిపడతామని ఒంగోలు ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో నంద్యాల జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ అక్రమాలు, అరాచకాలను వెలుగులోకి తీసుకొస్తున్న ‘సాక్షి’ విలేకరి సుబ్బారెడ్డి మీద టీడీపీ గూండాల దాడిని వ్యతిరేకిస్తూ శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతును బలంగా వినిపిస్తున్న ‘సాక్షి’ పత్రిక మీద అక్కసుతో అధికార కూటమి దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలిస్తే తమ గుట్టు రట్టవుతుందన్న భయంతోనే పచ్చ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని హరించివేస్తున్న కూటమి పాలకులు దాడులతో నిజాలను తొక్కిపెట్టాలను కోవడం అమాయకత్వానికి నిదర్శనమన్నారు. సుదీర్ఘకాలంగా జర్నలిస్టుగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి మీద దాడికి పాల్పడడం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. సుబ్బారెడ్డి మీద దాడికి పాల్పడిన టీడీపీ గూండాలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో ఎడిషన్‌ ఇన్‌చార్జి పి.రవిచంద్ర, బ్రాంచి మేనేజర్‌ శివన్నారాయణ, యాడ్స్‌ మేనేజర్‌ సిద్దవటం గణేశ్వర శర్మ, సబ్‌ ఎడిటర్లు డి.ప్రమోద్‌ కుమార్‌, ఎం.ప్రసాద్‌ బాబు, పి.రాజశేఖర్‌, వై జనార్దన్‌, ఎస్‌.సంధ్యా సుందర్‌, జి.గంగాధర్‌, జర్నలిస్టులు బి.మాల్యాద్రి, సాబీర్‌ హుస్సేన్‌, రత్నారెడ్డి, సువర్ణరాజు, ఫొటో జర్నలిస్టు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురంలో...

మార్కాపురం టౌన్‌: నంద్యాల జిల్లా ఆత్మకూరు ‘సాక్షి’ దిన పత్రిక విలేకరి సుబ్బారెడ్డిపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే శిక్షించాలని కోరుతూ ఏపీ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ విజయసునీత, ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనాలకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా జిల్లా యూనియన్‌ అధ్యక్షుడు ఎన్‌వీ రమణ మాట్లాడుతూ జర్నలిస్ట్‌లపై రోజు రోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వార్తల సేకరణకు వెళ్లిన సుబ్బారెడ్డిని ఉద్దేశపూర్వకంగా దాడి చేసి గాయపరచం అమానుషమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మూల అల్లూరిరెడ్డి, యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి బంకా శ్రీనివాసరావు, డీ జగన్నాథరెడ్డి, బూదాల థామస్‌, సీహెచ్‌ జాన్సన్‌, మల్లిఖార్జున, డి.బాబీ, సురేష్‌, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

టీడీపీ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement