బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం

డిజిటల్‌ బుక్‌ రెడీ చేశాం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

ఒంగోలు సబర్బన్‌:

చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగిపోయిన ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని లాయర్‌పేటతో పాటు పలు డివిజన్లలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 43వ డివిజన్‌ లాయర్‌పేటలో వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్ధి కుప్పం ప్రసాదుతో పాటు డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి, న్యాయవాది శేషు వేణుగోపాల్‌తో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత లాయరుపేట సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారంలో చెవిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనను, ఈ ప్రభుత్వ పాలనను చూశారని, ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని వెల్లడించారు. నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, సామాన్య మానవుడు బతికే వీలు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నాయకులు, కార్యకర్తలంతా ఒక తాటిపై ఉండి ఐకమత్యంగా కృషి చేస్తున్నామన్నారు. చంద్రబాబుకు సినిమా చూపించే సమయం దగ్గర పడిందని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికారులు, పోలీసులకు ఒకటే చెబుతున్నామని హెచ్చరించారు. మేము కూడా డిజిటల్‌ బుక్‌ రెడీ చేశామని, అక్రమంగా వ్యవహరిస్తున్న అధికారులను ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. మరో రెండు సంవత్సరాలు వేచి ఉండండి.. ఈలోపు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే ఫలితం అనుభవించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కుప్పం ప్రసాద్‌ అందరివాడని వినయశీలి, అభివృద్ధి కాంక్ష కలవాడని కితాబిచ్చారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు డీ క్రాంతి కుమార్‌, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement