నేడు ఒంగోలులో వైవీ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

నేడు ఒంగోలులో వైవీ ప్రచారం

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

నేడు ఒంగోలులో వైవీ ప్రచారం పోలీసు అమర వీరుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోర్డినేటర్‌ వైవీ సుబ్బారారెడ్డి గురువారం విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టనున్నారని పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. సాయంత్రం జయరామ్‌ థియేటర్‌ సెంటర్‌ నుంచి గాంధీరోడ్డు, ట్రంక్‌ రోడ్డుల్లో జరిగే భారీ రోడ్డుషోలో సుబ్బారెడ్డి పాల్గొంటారని చెప్పారు. వైవీ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొని మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌, డివిజన్‌ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఒంగోలు టౌన్‌: శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎందరో పోలీసులు అమరులై చేసిన త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలని అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) యన్‌.యుగంధర్‌ బాబు పోలీసు సిబ్బందికి సూచించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వారి త్యాగాలను తలుచుకుంటూ బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కర్నూలు రోడ్డు చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. తొలుత పోలీసు అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. పోలీసు అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని చెప్పారు. పోలీసు అమరవీరుల పోరాట చరిత్ర భవిష్యత్తరాల్లో దేశభక్తికి ప్రేరణ ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సీతారామిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement