వైద్యంతోపాటు ప్రజాసేవ | - | Sakshi
Sakshi News home page

వైద్యంతోపాటు ప్రజాసేవ

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

పట్టణాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత కిశోర్‌ శేఖర్‌రెడ్డి మైస్‌ సంస్థ ద్వారా కోనేరు, గాంధీపార్కు అభివృద్ధి సాగర్‌నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తాం ప్రజలందరి సహకారంతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరిస్తాం మార్కాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిని డాక్టర్‌ చప్పల్లి కనకదుర్గ

మార్కాపురం టౌన్‌: మార్కాపురం మున్సిపాలిటీలో ప్రజలందరికీ సేవ చేసేందుకు వైద్య వృత్తి చేస్తూనే.. రాజకీయాల్లోకి వచ్చానని మాజీ కౌన్సిలర్‌, వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిని డాక్టర్‌ చప్పల్లి కనకదుర్గ అన్నారు. పట్టణాభివృద్ధిపై బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆమె మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పథకాలు తీసుకు రావడంతో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత కార్పొరేట్‌ వైద్యం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ గృహాలు, గడప గడపకు కార్యక్రమం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఐదేళ్ల కాలంలో పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించారు. వాలంటీర్లు, సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన సేవలన్నింటినీ ఇంటివద్ద నుంచే పొందేలా వ్యవస్థలను రూపొందించారు. ఆయన స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తానని కనకదుర్గ తెలిపారు.

‘‘డాక్టర్‌ కిశోర్‌ శేఖర్‌రెడ్డి మైస్‌ సంస్థ ద్వారా ప్రజా సేవలో భాగంగా శిథిలావస్థకు చేరిన చెన్నకేశవస్వామి పుష్కరిణి (కోనేరు)ని అభివృద్ధి చేశారు. అలాగే పట్టణ నడిబొడ్డులో ఉన్న గడియార స్తంభం వద్ద గాంధీ పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన స్ఫూర్తితో గత 30 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంది పేద ప్రజల కష్టాలను, ఆర్ధిక పరిస్థితులను చూశాను. 2014, 2021లో కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందాను. అయితే పరిస్థితుల ప్రభావం వలన 2021లో చైర్‌పర్సన్‌గా అవకాశం చేజారింది. ప్రత్యక్ష ఎన్నికలు రావడంతో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీ చేశానని’’ చెప్పారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

అన్నీ ప్రాంతాలు సమాన అభివృద్ధి:

మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో ప్రధాన వార్డులతోపాటు శివారు కాలనీలు కూడా సమానంగా అభివృద్ధి చేస్తాం. పట్టణ శివారు కాలనీల్లో నేటికీ మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వలన కొంత మేర వ్యాధులు ప్రబలే అవకాశం తక్కువగా ఉంటుంది. సీసీ రోడ్లు, వీధిలైట్లు, నీటి సరఫరా మెరుగుపరుస్తాం

సాగర్‌ నీరు సక్రమంగా సరఫరా:

మార్కాపురం పట్టణానికి దూపాడు నుంచి వచ్చే సాగర్‌ నీరు కొంతమేర అంతరాయం ఏర్పడుతుంది. సాగర్‌ నీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరంగా ప్రజలకు నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. మరికొన్ని వార్డుల్లో పైపులైన్లకు మరమ్మతులు లేక నీరు వృథా అవుతోంది. దీంతో ప్రజలు నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంటికి కుళాయిలను ఏర్పాటు చేసి నీరు వృథా కాకుండా ప్రజలకు నీటిని అందిస్తాం.

ట్రాఫిక్‌ ఇబ్బందులను తీరుస్తాం:

మార్కాపురం పురపాలక సంఘం జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలు, అధికారుల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ ప్రణాళికను రూపొందిస్తాం. ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ

అభ్యర్థులను గెలిపించాలి:

మార్కాపురం మున్సిపల్‌ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థినైన నన్ను, కౌన్సిలర్‌ అభ్యర్థులందరినీ ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement