ఈ ఎన్నికలు టీడీపీ పతనానికి నాంది | - | Sakshi
Sakshi News home page

ఈ ఎన్నికలు టీడీపీ పతనానికి నాంది

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

సుపరిపాలన కోసం ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి ఎన్నికల ప్రచారంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మేరుగు నాగార్జున, బూచేపల్లి వెంకాయమ్మ

చీమకుర్తి రూరల్‌: చంద్రబాబును నమ్మి నిలువునా మోసపోయాం గత అసెంబ్లీ ఎన్నికల్లో జగనన్నను కాదని టీడీపీకి ఓటు వేసి సంక్షేమానికి దూరమయ్యాం...పొరపాటు జరిగిందని ప్రజలే స్వచ్ఛందంగా తరలివచ్చి చెబుతున్న పరిస్థితుల్లో మున్సిపల్‌ ఎన్నికలు టీడీపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకనున్నాయని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, సీఈసీ మెంబర్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి బుధవారం ఉదయం పాటిమీదపాలెం గ్రామంలో 28 వార్డు అభ్యర్థి మూలే కృష్ణకుమారికి మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హామీల పేరుతో మోసం చేసిన టీడీపీ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల వార్డు ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో టీడీపీ నాయకుల్లో వణుకు పుడుతోందన్నారు. ఎన్నికల్లో ప్రజల తీర్పుతో 2029లో మళ్లీ జగనన్న పాలన రావడం ఖాయమన్నారు. నవంబర్‌ 1న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవిని, 28 వార్డుల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జగనన్న కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

రెండున్నరేళ్లలో కూటమి పాలన విఫలం:

రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైనట్లు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ కింద దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారులను మోసం చేశారన్నారు. ఎన్నికల డ్రామాలో భాగంగా పింఛన్ల కోసం అర్జీలు తీసుకుని అర్హులైన పేదలను వంచించారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి రూ.1500, నిరుద్యోగులకు భృతి, పేదలకు ఇళ్లు ఇలా చెప్పిన హామీలు ఏమయ్యాయో ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి:

వైఎస్సార్‌ సీపీ ఫ్యాను గుర్తుకు ఓటు వేయండి. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తించండి అని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, సీఈసీ మెంబర్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి, 28వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి మోలే కృష్ణకుమారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌ రెడ్డి, కే శివారెడ్డి, సింగం కొండలు, మూలే రమణారెడ్డి, కిష్టపాటి శ్రీనివాసరెడ్డి, మాలకొండయ్య, సూది శ్రీను, మంచ హరికృష్ణ, పాలడుగు సుబ్బు, గంగిరెడ్డి ఓబుల్‌ రెడ్డి, మేడగం హర్షిత్‌, రాజశేఖర్‌ రెడ్డి, సాదినేని వెంకటరావు, సంతోష్‌, సామేలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement