రెండు ద్విచక్ర వాహనాలు ఢీ | - | Sakshi
Sakshi News home page

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

కొమరోలు: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని గోపనపల్లె– నరసింహపల్లె రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. కొమరోలు నుంచి రక్షింపల్లెకు స్కూటీపై ప్రయాణిస్తున్న నితీష్‌రెడ్డి (22) ఎదురుగా వచ్చిన ఇమ్మడి చంద్రశేఖర్‌ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నితీష్‌రెడ్డి తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, అక్కిరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. నితీష్‌రెడ్డి ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చేతికందివచ్చిన కుమారుడి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. స్థానిక ఎస్సై నాగేంద్రరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని గిద్దలూరు ఏరియా వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement