నాగులుప్పలపాడు: అర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత గ్రామాలైన కనపర్తి, మేకల సోమయ్య పట్టపుపాలెం, చిన్నంగారి పట్టపుపాలెంలలో తీర ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించి ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి జాగ్రత్తలు తెలియజేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఎవ్వరూ వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. వారి వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీపీఓ అనుపమ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.


