అశ్రునయనాలతో చిన్నారి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో చిన్నారి అంత్యక్రియలు

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

నాగులుప్పలపాడు: మానవ మృగం చేతిలో బలైన చిన్నారి అంత్యక్రియలు స్వగ్రామంలో పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘటన అనంతరం చిన్నారి మృతదేహాన్ని సోమవారం పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. చిన్నారి తల్లిదండ్రులు హైదరాబాద్‌ నుంచి రావడం ఆలస్యం కావడంతో సోమవారం రాత్రి చిన్నారి మృతదేహనికి పోస్టుమార్టం పూర్తి చేసి తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం బాలిక స్వగ్రామంలో మంగళవారం ఉదయం బంధువులు, తల్లిదండ్రుల ఆర్తనాదాల నడుమ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

బాధిత కుటుంబానికి బాలల హక్కుల కమిషన్‌ పరామర్శ

బాధిత కుటుంబసభ్యులను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు వి. గాంధీబాబు పరామర్శించారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా గాంధీబాబు మాట్లాతూ ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అన్ని సాక్ష్యాధారాలను ప్రభుత్వానికి అందజేసి నిందితుడికి తగిన శిక్ష వేసేలా త్వరితగతిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరామర్శించిన వారిలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ పద్మ సునంద, డీసీపీ దినేష్‌ కుమార్‌ తెలిపారు.

నిందితుడి పరిస్థితి విషమం

కేసులో ప్రధాన నిందితుడు అజ్జం ఆనంద్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారిపై అఘాయిత్యం చేసి చంపివేసిన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన క్రమంలో గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ఆ సమయంలో నిందితుడు తీవ్ర గాయాలతో ఉండటంతో పోలీసులు ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నిందితుడి పల్స్‌ రేటు 30కి పడిపోయినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement