వైఎస్సార్‌ సీపీలోకి 350 కుటుంబాల చేరిక | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి 350 కుటుంబాల చేరిక

Oct 28 2026 1:30 AM | Updated on Oct 28 2026 1:30 AM

మార్కాపురం అర్బన్‌: జనసేన పార్టీ నుంచి సుమారు 350 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. స్థానిక కంభం రోడ్డులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు సమక్షంలో బొందిలి కాశీరాంసింగ్‌ నాయకత్వంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రజల పార్టీ, అందుకే ఇంత పెద్ద సంఖ్యలో చేరారన్నారు. సుమారు 350 కుటుంబాల పార్టీలో చేరడం కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లే సమయం ఆసన్నమైందన్నారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలనను భరించలేకనే వైఎస్సార్‌ సీపీలో చేరినట్లు బొందిలి కాశీరాంసింగ్‌ తెలిపారు. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందని కుటుంబం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్‌ సలీమ్‌, చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ చప్పల్లి కనకదుర్గ, వార్డుల అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement