జెడ్పీ సీఈఓగా జోసెఫ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈఓగా జోసెఫ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

Oct 26 2026 3:10 AM | Updated on Oct 26 2026 3:10 AM

జెడ్పీ సీఈఓగా జోసెఫ్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ జాతీయస్థాయి పోటీలకు దర్శి విద్యార్థులు లాడ్జిలో వ్యభిచార ముఠా పట్టివేత షార్ట్‌ సర్క్యూట్‌లో గుడిసెలు దగ్ధం

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జెడ్పీ సీఈఓగా ఏ జోసెఫ్‌ కుమార్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ విజయసునీతను కలిసి బొకే అందించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడంతో పాటు జిల్లా పరిధిలో గ్రామీణాభివృద్ధి, సంక్షేమపథకాలు, పంచాయతీరాజ్‌ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే ప్రథమ ప్రాధాన్యత అని జోసెఫ్‌ కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

దర్శి: మండలంలోని కొత్తపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన వల్లెపు రామ్‌చరణ్‌, పి. మణికంఠలు గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 10న జరిగిన అండర్‌–14,అండర్‌–17 హ్యాండ్‌బాల్‌ మీట్‌లో ప్రతిభ కనపరిచారు. వీరి ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఉమారియాలో జరిగే నేషనల్‌ మీట్‌లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, జిల్లాస్థాయిలో మార్కాపురంలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనపరిచిన మరి కొందరు క్రీడాకారులను ఉపాధ్యాయులు అభినందించారు.

ఒంగోలు టౌన్‌: నగరం నడిబొడ్డులోని లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం వచ్చింది. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ కమలాకర్‌ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య, సిబ్బంది కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులతో పాటుగా లాడ్జి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం ఒన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.

● రూ.5 లక్షల ఆస్తి నష్టం

అద్దంకి: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తిమ్మాయపాలెంలోని అద్దంకి–దర్శి రహదారి లోని బట్టీల వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన అడుసుమల్లి హనుమంతరావు దర్శి రహదరిలోని పొలాల్లో గత కొన్నేళ్లుగా ఇటుక బట్టీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బట్టీల వద్దకు వచ్చి ఇటుక కోసే కూలీల నివాసం కోసం షెడ్లు వేశాడు. వారు అందులో నివాసం ఉంటూ ఇటుక పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం గుడిసెలకు పక్కనే ఉన్న విద్యుత్‌ స్థంభం నుంచి సప్‌లై వైరు తెగి గుడిసె మీద పడడంతో మంటలు చెలరేగాయి. ఉలిక్కిపడిన కూలీలు గుడిసెల నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేసే లోపే పది గుడిసెల వరకు దగ్ధమయ్యాయి. గుడిసెల్లోని కూలీల సామాను, బియ్యం, ఇతర సామాగ్రి మొత్తం కాలిపోయాయి. ప్రమాదంలో రూ.5 లక్షల మేర నష్టంవాటిల్లిందని బట్టీ యజమాని హనుమంతరావు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement