స్థానిక సంస్థల్లో విజయం కోసం పనిచేయండి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించండి కార్యకర్తల సమావేశంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
కురిచేడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, వారికి అండగా పార్టీతోపాటు తాము కూడా ఉన్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక గుంటక నాసరరెడ్డి కళ్యాణ మండపంలో బుధవారం దొనకొండ, కురిచేడు మండలాల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి పార్టీకి వివిధ పార్టీలతోపాటు, మీడియాలు కూడా చాలా ఉన్నాయన్నారు. వాటి ద్వారా లేని దానిని ఉన్నట్లు సృష్టిస్తున్నారని, కానీ ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సూపర్‌సిక్స్ పథకాలను గాలికి వదిలేసి వారి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దోచిపెట్టడమే పరమావధిగా పనిచేస్తున్నారని విమర్శించారు. కూటమి పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందో, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎలా తప్పుడు హామీలతో గద్దెనెక్కిందో ప్రజలకు వివరించాలన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలతోపాటు, ఇవ్వని వాటిని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల వద్దకు వలంటీర్ల ద్వారా సేవలు అందించిన ప్రజా నాయకుడు కావాలో? మోసం చేసి వెన్నుపోటు పొడుస్తున్న నాయకుడు కావాలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు.
స్థానిక సంస్థల్లో విజయం సాధిద్దాం..
మళ్లీ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే స్థానిక సంస్థలు వాటికి పునాది అన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా, ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి పక్షంలో ఉండి స్థానిక సంస్థలను కై వసం చేసుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందన్నారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందనటానికి ప్రస్తుత దుస్థితే నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పింఛన్ల నాటకం ఆడారని, దరఖాస్తులు ఇచ్చినా ఇంతవరకు మంజూరు చేయలేదన్నారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా శాంతియుతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి పోటీచేయాలన్నారు. అత్యవసర సేవలు అందించే వాహనాలు గత ప్రభుత్వంలో ఫోన్ చేయగానే వచ్చేవని, అధికారం రాగానే వాటికి రంగులు మార్చారు గానీ వాటి పనితీరును మాత్రం మార్చలేకపోయారని, ప్రమాదం జరిగి ఫోన్ చేస్తే వాహనం అందుబాటులో లేక తన సొంత వాహనంలో వ్యక్తిని ఆస్పత్రికి పంపానని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు వివక్ష చూపి పార్టీ వారికి పథకాలు ఇవ్వటంలేదు: బూచేపల్లి వెంకాయమ్మ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అర్హులందరికీ ఇచ్చిన ఏకై క దమ్మున్న ముఖ్యమంత్రి అని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి పథకాలు రాకుండా అడ్డుకుంటూ వివక్ష చూపుతున్నారని ఆమె విమర్శించారు. ఆరోగ్యశ్రీని నిర్వహించలేక, ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా ఆస్పత్రుల్లో ఫీజులు వసూలు చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి కూటమి పార్టీదని ఆమె విమర్శించారు.
మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సన్మానం:
అనంతరం మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను సన్మానించారు. పార్టీ పదవులు పొందిన వారికి ఐడెంటిటీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో రెండు మండలాల కన్వీనర్లు వైవీ సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, నాయకులు నుసుం వెంకట నాగిరెడ్డి, బొరిగర్ల ఉషామురళి, శ్రీ కాంత్‌రెడ్డి, షేక్.సైదా, పోతిరెడ్డి నాగిరెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, మేరువ సుబ్బారెడ్డి, జీ దేవప్రసాదు, జీ లింగారెడ్డి, కాసు భాస్కరరెడ్డి, నుసుం ప్రతాపరెడ్డి, ఎన్వీ నాగిరెడ్డి, ఆవుల వెంకటరెడ్డి, యం నాగమణి, వీ కోటయ్య, మాదిరెడ్డి శేషమ్మ, అన్నెం సుబ్బారెడ్డి, బీ నాగయ్య, బీ మహేష్, కే కృష్ణయ్య, కే గంగయ్య, కే నాగేశ్వరరావు, ఆర్ గురుప్రసాదు, బీ వెంకటనర్సయ్య, కానాల శివారెడ్డి, పెండ్యాల సాంబశివరావు, గండి అంకమ్మ, ముసిరిక యోగిరెడ్డి, కొత్తమాసు సుబ్రహ్మణ్యం, షేక్.మెహరాలి, అంకే గోపాలకృష్ణ, నక్కాబుజ్జి, నక్కా అంజి, మూరబోయిన రమేష్, వెంకటేశ్వర్లు, కాలూరి రమణ, జీ పోలిరెడ్డి, గంగదారి వెంకట సుబ్బయ్య, బాపనపల్లి శ్రీను, బాపనల్లి ఆంజనేయులు, వేమనబ్రహ్మారెడ్డి, బి ఎల్లయ్య, మూర్తెయ్య, రాజు, శివ, ప్రసాదు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


