ఒంగోలు మెట్రో: ప్రముఖ సినీ హీరో నాని ఒంగోలులో బుధవారం సందడి చేశారు. ఆయన నటించిన ప్యారడైజ్ సినిమా విజయవంతమైన నేపథ్యంలో ఆ సినిమా ప్రదర్శిస్తున్న కృష్ణ థియేటర్‌కు వచ్చిన ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నానిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. థియేటర్ యాజమాన్యం ఆయన్ను ఘనంగా సత్కరించారు.
ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని డీఆర్‌ఆర్ మున్సిపల్ హైస్కూల్‌లో 70వ ఎస్‌జీఎఫ్‌కు సంబంధించిన గట్కా, థాంగ్‌ట, కళరీ క్రీడలకు సంబంధించిన విద్యార్థినులను ఎంపిక చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా తరఫున 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ పీ రవిశంకర్ ఈ క్రీడలను ప్రారంభించారు. గట్కా, కళరీపట్టు, థాంగ్‌ట క్రీడలకు సంబంధించి అండర్ 17, అండర్ 19 విభాగాల్లో వెయిట్, కేటగిరీలను బట్టి బాలబాలికల జట్టును ఎంపిక చేశారు. కార్యక్రమంలో రామ్ నగర్ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుని జోష్నాదేవి, బెన్ని, అనిల్ కుమార్, నాగేంద్రమ్మ, వీరేంద్ర, జ్యోతి, కిరణ్, సోము మధులకు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


