కొలువులో అధికారులు పెత్తనం నేతలదే..! | - | Sakshi
Sakshi News home page

కొలువులో అధికారులు పెత్తనం నేతలదే..!

Oct 1 2026 12:41 AM | Updated on Oct 1 2026 12:41 AM

కనిగిరి: మండల పరిషత్‌ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో.. ఆ స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను ప్రారంభించింది. మార్కాపురం జిల్లాలోని 21 నాలుగు నియోజకవర్గాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. వీరిలో కొందరు స్థానికంగా వివిధ శాఖల్లో నియోజకవర్గ, ఏడీ స్థాయి అధికారులుండగా.. ఎక్కువ మందిని జిల్లా, సబ్‌డివిజన్‌, డివిజన్‌ స్థాయి అధికారులను నియమించారు.

కూటమి నేతలదే పెత్తనం..

సర్పంచ్‌లు పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభించారు. దీంతో క్షేత్ర స్థాయిలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. అనేక చోట్ల కనీసం పారిశుధ్య పనులు కూడా జరిగిన దాఖలాలు లేవు. పంచాయతీలో ఏదైనా అత్యవసర పనులు చేయాలన్నా స్పెషల్‌ గ్రాంట్‌, లేదా జనరల్‌ ఫండ్‌ తదితర నిధులు ఖర్చు చేయాలన్నా.. గతంలో సర్పంచ్‌ స్థానాన ఉన్న గ్రామ ప్రత్యేక అధికారి సంతకం అవసరం. దీంతో వారు కేవలం అధికార పార్టీ నేతలు, ఆదేశించిన, చెప్పిన పనులకే ప్రాధాన్యం ఇచ్చి పనులు, నిధుల డ్రాకు సంతకాలు పెడుతున్నారు. దీంతో గ్రామ సమస్యల పరిష్కారానికి తామెందుకు పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో కార్యదర్శి, వీఆర్‌ఓలు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో గ్రామ స్థాయిలో ప్రత్యేక పాలన పూర్తిగా కుంటుపడింది. ఈ క్రమంలో గత నెల 23న ఎంపీపీల పదవీ కాలం యుగియడంతో వారి స్థానంలో మండల ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు ఈ నెల 24 బాధ్యతలు చేపట్టారు. మండల స్థాయిలో అధికంగా గ్రాంట్లు, జనరల్‌ ఫండ్‌లు ఉండే అవకాశం ఉండటంతో పూర్తిగా అధికార కూటమి నేతల కనుసన్నల్లో పనిచేసే అధికారులే కొలువు తీరారు. మొన్నటి దాక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీపీలు అత్యధిక స్థానాల్లో ఉండటంతో కేవలం ఎంపీడీఓ గది రూంను అడ్డాగా చేసుకుని అనధికార పాలన సాగింది. ఎంపీపీ పదవీ కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల ఆఫీసు గదుల్లో కూటమి పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు తిష్ట వేసి పూర్తి ఆజమాయిషి చెలాయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీపీలు పదవీలో ఉన్నప్పుడే పింఛన్ల మంజూరు విషయం, చంద్రన్న చేనేత పథకం తదితర పథకాల అమలు పూర్తిగా ద్వితీయ శ్రేణి నేతల కనుసన్నల్లోనే అర్హుల ఎంపికలు జరిగాయనే అరోపణలు ఉన్నాయి. ప్రస్తుత తరుణంలో సంక్షేమ పథకాల పారదర్శకత, వాటిని అర్హులకు అందచేసే విషయంలో ప్రత్యేక అధికారులకు, ఎంపీడీఓలకు ఇక్కట్లు తప్పడం లేదు.

కొలువు తీరారు.. వెళ్లారు..

నియోజకవర్గంలోని కనిగిరి మండలానికి ప్రత్యేకాధికారిగా గజ్జల శ్రీనివాసులరెడ్డి (పశుసంవర్ధక శాఖ ఏడీహెచ్‌, కనిగిరి), సీఎస్‌పురం సుదర్శన్‌రావు( పశుసంవర్ధక శాఖ ఏడీ, సీఎస్‌పురం), హెచ్‌ఎంపాడుకు నరేంద్రారెడ్డి( పశుసంవర్ధక శాఖ ఏడీహెచ్‌, హెచ్‌ఎంపాడు), పామూరుకు శ్రీనివాసమూర్తి(డీడీ, మార్కాపురం), పీసీపల్లికి గోపి( డ్వామా ఏపీడీ), వెలిగండ్లకు సోమసుబ్బారావు( డీఈఓ మార్కాపురం) లను నియమించారు. అయితే వీరంతా ఈ నెల 24 ప్రత్యేక అధికారులుగా కార్యస్థానాల్లో కొలువు తీరారు. విధుల్లో చేరిన తర్వాత పామూరు, వెలిగండ్ల, పీసీపల్లి మండల ప్రత్యేక అధికారులు కార్యస్థానాల్లో, మండలాల్లో కరువైయ్యారు. సొంత శాఖ విధుల్లో బీజీ బీజీగా ఉండే ఈ అధికారులకు ప్రత్యేక అధికారుల హోదా అదనపు భారంగా మారిందనే విమర్శలున్నాయి. దీంతో వీరు ప్రత్యేకాధికారుల విధులకు నామ్‌కే వాస్తేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే గ్రామ, పంచాయతీ అధికారులు అలంకారప్రాయంగా కాగా.. ఇక మండల స్థాయి ప్రత్యేక అధికారులు కూడా అలంకారంగా మారనున్నారు. దీంతో కొత్త ప్రజాప్రతినిధులు కొలువు తీరేంత వరకు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతల చేతుల్లో క్షేత్ర స్థాయి అధికారులు కీలు బొమ్మలుగా పనిచేయాల్సిందే. లేదంటే అధికారులకు సమస్యలు తప్పవనే ఆదేశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

కూటమి నేతల కనుసన్నల్లో ప్రత్యేక పాలన

బాధ్యతలు స్వీకరించినా కనిపించని అధికారులు

పంచాయతీ, మండలాల్లో ద్వితీయ శ్రేణి నేతలదే పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement