పాఠశాల అభివృద్ధికి సహాయపడతాం.. | - | Sakshi
Sakshi News home page

పాఠశాల అభివృద్ధికి సహాయపడతాం..

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

చీమకుర్తి రూరల్‌: చీమకుర్తిలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం చీమకుర్తి జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌ గ్రౌండ్‌ ఫ్లోర్లో అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులు, జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌ ప్రహరీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రహరీ నిర్మాణానికి రూ.5 లక్షలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.10 లక్షలు జిల్లా పరిషత్‌ నిధుల నుంచి మంజూరు చేయించి పనులు పూర్తి చేయించినట్లు తెలిపారు. బాలికల పాఠశాలను అభివృద్ధి చేయాలన్నది తమ తండ్రి ఆశయమని, పాఠశాలను దత్తత తీసుకుని ప్రభుత్వ నిధులు అందకున్నా సొంత నిధులతోనైనా అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అప్పటి విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చొరవతో పాఠశాలను బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా మార్చినప్పటి నుంచి అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా పరిషత్‌ నుంచి రూ.63 లక్షలు కేటాయించి పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఇకముందు కూడా పాఠశాలకు అవసరమైన సదుపాయాల కల్పనకు సొంత నిధులతో సహకరిస్తామని ప్రకటించారు. జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి బూచేపల్లి వెంకాయమ్మ కృషితో సాకారమైందన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది, విద్యార్థులు బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వేమా శ్రీనివాసరావు, యద్దనపూడి శ్రీనివాసరావులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ గోనుగుంట వీరాస్వామి, ఎంఈఓలు శివాజీ, నరసింహారావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ రామస్వామి సూర్యచంద్రరావు, మాజీ కౌన్సిలర్లు గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, బాపతు వెంకటరెడ్డి, సోమా శేషాద్రి, బెల్లం వెంకటరావు, పాటిబండ్ల గంగయ్య, పత్తి కోటేశ్వరరావు, బడే అయ్యప్పరెడ్డి, కంజుల ప్రతాపరెడ్డి, బాబూరావు, ఎల్లయ్య, రామబ్రహ్మం, తెల్లమేకల గాంధీ, చీదర్ల శేషు, సాధినేని వెంకటరావు, ఆత్యాల దావీదు, పాలడుగు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, ఎమ్మెల్యే బూచేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement