వినియోగదారుల ఫిర్యాదులపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగదారుల ఫిర్యాదులపై దృష్టి సారించాలి

Sep 17 2026 2:14 AM | Updated on Sep 17 2026 2:14 AM

వినియోగదారుల ఫిర్యాదులపై దృష్టి సారించాలి

ఒంగోలు సబర్బన్‌: వినియోగదారుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పి. పుల్లారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకాశం సర్కిల్‌ పనితీరుపై విజయవాడలోని కార్పొరేట్‌ కార్యాలయం నుంచి బుధవారం సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్‌ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్‌ లాస్‌ తగ్గింపు, విద్యుత్‌ చౌర్యం నియంత్రణ, విద్యుత్‌ భద్రత, లైనన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, వర్షాల అత్యవసర సన్నద్ధత, సబ్‌స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్‌ అంతరాయాల నియంత్రణపై సమీక్షించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లుకు సూచనలు చేశారు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థాని క అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement