ఒంగోలు సబర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం దేశ వ్యాప్త బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. అందులో భాగంగా జిల్లాలోని బ్యాంకులన్నీ మూతబడనున్నాయి. జిల్లా యూఎఫ్‌బీయూ కన్వీనర్ రాజీవ్ రతన్ దేవ్ విడుదల చేసిన ప్రకటన మేరకు ఐదు రోజుల బ్యాంకింగ్, న్యాయమైన పీఎల్‌ఐని కోరుతూ బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన, సమానమైన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ మంజూరు చేయాలని కోరుతున్నారు. బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన ఐదు రోజుల బ్యాంకింగ్ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా చేస్తున్నట్లు వివరించారు.


