భారీగా మొహరించిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

భారీగా మొహరించిన పోలీసులు

Sep 10 2026 2:33 AM | Updated on Sep 10 2026 2:33 AM

నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మొహరించారు. ప్రజలకు మద్దతు ఇవ్వడానికి వస్తున్న మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ను అడ్డుకునేందుకు యరజర్ల వద్ద మూడు టీంలుగా పోలీసులు బారికేడ్లు ఉంచారు. అలాగే మర్లపాడు వద్ద కొండల మీదుగా వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ అడ్డుకున్నారు. పోలీసులు ఎలా అడ్డుకున్నా దాదాపు 500 పైనే ఆయా గ్రామల ప్రజలు, మహిళలు, రైతులు హాజరయ్యారు. అలాగే పోలీసులు ఆంక్షలు పెట్టడంతో డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, మండల పార్టీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు మరి కొందరు ఒంగోలు నుంచి మంగమూరు మీదుగా కొణిజేడు చేరుకొని నిరసన సభకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement