రెక్కలు విప్పినరేషన్‌ బియ్యం దందా..! | - | Sakshi
Sakshi News home page

రెక్కలు విప్పినరేషన్‌ బియ్యం దందా..!

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

ఇటీవల పట్టుకున్న బియ్యాన్ని షాపులో దింపుతున్న దృశ్యం(ఫైల్‌)

పీసీపల్లి:

కూటమి ప్రభుత్వం అధికారంలో రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ బియ్యం అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని దిగ్విజయం నిర్వహిస్తున్నాడు. నెల నెలా లక్షల్లో ముడుపులు చెల్లిస్తూ పేదల బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. ఇదంతా సదరు నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి, ముఖ్య అధికారుల సహకారంతోనే సాగుతున్న దందానే.

నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెల నెలా మామూళ్లు

సదరు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారి తన అక్రమ వ్యాపారం సక్రమంగా సాగేందుకు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి నెల నెలా పెద్ద మొత్తంలో ముట్టజెబుతున్నారు. వచ్చిన ఆదాయంలో పర్సంటేజీ చొప్పున గతంలో ఎన్నడూ లేనంత మొత్తాన్ని ఇస్తుండటంతో సదరు ప్రజాప్రతినిధి పూర్తి సహాయ సహకారం అందిస్తతాన్నడు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పథకంలో అధిక మొత్తంలో అక్రమంగా తరలిపోతోంది. రేషన్‌ బియ్యం డీలర్లతో వ్యాపారి కుమ్మకై ్క 5వ తేదీ నుంచి 15వ తేదీ లోపు మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు దాటి మిల్లర్లకు కొన్ని టన్నుల బియ్యం వెళ్లగా, రాష్ట్రాలు దాటి మరికొన్ని బియ్యం షిప్పులలో ఇతర దేశాలకు తరలివెళుతోంది.

వీరి దందా సాగుతుంది ఇలా..

గోడౌన్‌ నుంచి వచ్చే బియ్యాన్ని ప్రతి దుకాణానికి ఐదు నుంచి పది బస్తాలు తగ్గించి ఇస్తున్నారు. అలా తగ్గించి ఇచ్చిన బస్తాలను వారు తరలించడానికి అనువుగా ఉన్న మండలాల్లోనే రెండు, మూడు డీలర్‌ షాపుల్లో నిల్వ ఉంచుతున్నారు. ఆ బియ్యాన్ని చిన్న చిన్న డీసీఎం వాహనాల్లో 10వ తేదీ లోపే ఒక చోటకు తరలించి అక్కడ నుంచి లారీలకు ఎత్తుని తొలుత మిల్లర్లకు తరలిస్తున్నారు. రెండో విడతగా డీలర్లే పేదల నుంచి కిలో రూ.8, 10లకు కొనుగోలు చేసి రూ.15 నుండి రూ.20లకు వ్యాపారస్తులకు అమ్ముకుంటారు. మీరు మరలా రీసైక్లింగ్‌ గోతాలు, సంచులను మార్చి మిల్లర్లకి, షిప్పులలో దేశాలు దాటిస్తూ లక్షలు గడిస్తున్నారు.

వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరు

కనిగిరి నియోజకవర్గంలో ఇద్దరు వ్యాపారుల మధ్య బియ్యం అక్రమ వ్యాపారంలో ఆధిపత్య పోరును వెలుగుచూసింది. ఉమ్మడి జిల్లా మొత్తం ఈ వ్యాపారం సాగించే వ్యక్తి, పీసీపల్లి మండలం అలవలపాడుగ్రామానికి చెందిన వ్యాపారి ఇద్దరూ నువ్వా..నేనా అన్నట్లు గొడవలకు దిగుతున్నారు. ఈ నెల 5వ తేదీన పీసీపల్లి వ్యాపారి నియోజకవర్గంలో రేషన్‌ బియ్యాన్ని సేకరించి గుదేవారిపాలెం వద్దకు బియ్యాన్ని తరలిస్తున్నారు. ఆ సమయంలో ఒంగోలుకు చెందిన వ్యాపారి వాహనాన్ని ఆపడంతో ఇద్దరూ గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ మండల స్థాయి నాయకుడు ఈ పంచాయితీని నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్దకు తీసుకెళ్లాడు. సదరు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఇద్దరూ ముడుపులు ఇస్తుండటంతో ఇద్దరూ సర్దుకుపోవాలని, కలిసి పనిచేసుకోవాలని సూచించినట్లు సమాచారం. గత 10 రోజులు ఇద్దరు వ్యాపారులు ఆధిపత్య పోరుకు దిగడంతో బియ్యం అక్రమ వ్యాపారం దందా కొంత రోడ్డున పడింది. అసలు గ్రామాల్లో పట్టపగలే రేషన్‌ బియ్యం బస్తాలను ఇతర బస్తాల్లోకి మారుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

అక్రమార్కులకు అధికారులు వత్తాసు

పేదల బియ్యం అక్రమార్కుల కాసులు కురిపిస్తోంది. అయినా ఈ విషయాన్ని అధికారులకు తెలిసినా తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా దొరికినా అధికార పార్టీ డీలర్లు కావడంతో గంటల వ్యవధిలోనే వదిలేస్తున్నారు. అధికారుల సాక్షిగా అధికార పార్టీ నాయకులు, డీలర్లు కుమ్మకై ్క రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించినా అధికారులు షరా మామూలే అన్నట్లు వారి మామూళ్లు వారు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి నెలా వేల బస్తాల బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పేదల కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం అక్రమార్కులకు వరంగా మారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ పెద్ద

నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని రేషన్‌ బియ్యాన్ని గ్రామాల నుంచి జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటిస్తూ కోట్లు

గడిస్తున్నారు. నియోజకవర్గ ప్రతినిధులకు నెల నెలా పెద్ద మొత్తంలో పర్సంటేజీలు ఇస్తూ దందా సాగిస్తున్నారు. దాడులు చేసి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను

అడ్డుకోవాల్సిన విజిలెన్స్‌ అధికారులు మామూళ్ల మత్తులో సంపూర్ణ సహకారం ఇవ్వడంతో వీరి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement