చెరువు మట్టిని తవ్వేస్తున్నారు..! | - | Sakshi
Sakshi News home page

చెరువు మట్టిని తవ్వేస్తున్నారు..!

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

చెరువు మట్టిని తవ్వేస్తున్నారు..! అంగన్‌వాడీల్లో మౌలిక వసతులు ఉండాలి

సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

గుడ్లూరు: గ్రామాల్లో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చివరకు సాగునీటి చెరువులో మట్టిని తవ్వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..మండలంలోని జానికంపేట చెరువు 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు ఆయకట్టు కింద కొన్ని ఎకరాల భూమి ఉంది. ఈ క్రమంలో జానికంపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టికి చెందిన కాపూలూరు మోహన్‌రావు, కాపులూరు ప్రసాద్‌లు గ్రామంలో కాంట్రాక్ట్‌లు చేశారు. అయితే ఆ పనుల్లో నష్టం రావడం, నష్టం ఎలా పూడ్చుకోవాలన్న సందగ్ధంలో పడ్డారు. ఈ క్రమంలో లింగసముద్రం, పెదపవనిలోని ఇటుక బట్టిల యజమానితో రూ.10 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గుండ్లపల్లి శివ, కాపులూరు కొండలావును చెరువు మట్టిని ఎక్కడకు తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు. అయితే కాపులూరు మోహన్‌రావు అఢగడానికి మీరెవరు అంటూ నిర్లక్ష్యంగా ప్రదర్శించాడు. ప్రభుత్వం మాది..అడ్డు వస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపుతానంటూ బెదిరించాడు. బుధవారం ఉదయం కందుకూరు సబ్‌కలెక్టరుకు జానకంపేట చెరువులో ని మట్టిని అక్రమంగా తరలించటాన్ని అపేయాలని వినతిపత్రం అందచేశారు. ఈ మండలంలో తెట్టు ఏలూరుపాడు , చెమిడిదపాడు చెరువుల్లో ప్రతి రోజు మట్టిని ఇటుక బట్టిలకు , తరలిస్తూ తెలగు తమ్ముళ్ళు జేబులు నింపుకుంటున్నారు రాత్రి పూటి ఎలూరుపాడు చెరువు నుంచి టిప్పర్లు ద్వారా గ్రావెల్‌ను కావలికి తరలిస్తున్నారు. ఇప్పటికై న ఇరిగేషన్‌ అధికారులు స్పందించి చెరువుల నుండి అక్రమంగా తరలిస్తూన్న మట్టిమాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు ఈవిషయం గురించి ఇరిగేషన్‌ ఏఈ సీతారామయ్యను వివరణ అడగగా చెరువులనుండి ఇటుక బట్టీలకు మట్టిని వ్యాపారులు తోలుకుంటుందన్నది వాస్తవమేనని పేర్కొన్నారు. ఇటుక బట్టీలకు మట్టిని తోలకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల అవసరాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె తన ఛాంబర్‌లో బుధవారం ఐసీడీఎస్‌ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి సేవలు కార్యక్రమం కింద అమలు చేస్తున్న వివిధ కార్యకలాపాలు, వాటి పురోగతిని సమీక్షించేందుకు సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్ల, విద్యుత్‌ కనెక్షన్ల, ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసీడీఎస్‌, సీడీపీఓలను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి కనెక్షన్లు, విద్యుత్‌ కనెక్షన్లు, ఇతర గ్రామీణ నీటి సరఫరా శాఖ జిల్లా అధికారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్‌, ఇతర అవసరమైన సదుపాయాల స్థితిని క్రమం తప్పకుండా సమీక్షించి లోపాలను ఎటువంటి ఆలస్యం లేకుండా సరిచేయాలని ఆదేశించారు. అంగన్‌్‌వాడీ కేంద్రాల సామర్థ్యం, పనితీరును అంచనా వేయడంపై ఐసీడీఎస్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పనితీరు తక్కువగా ఉన్న అంగన్‌న్‌వాడీ కేంద్రాలను గుర్తించి, వాటి పనితీరును మెరుగుపరిచేందుకు సరిదిద్దే చర్యలు చేపట్టేలా, క్రమం తప్పకుండా పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement