రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Aug 13 2026 1:39 AM | Updated on Aug 13 2026 1:39 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కొండచిలువ కలకలం బ్యాంకు ఉద్యోగుల నిరసన

భర్తకు తీవ్రగాయాలు

మద్దిపాడు: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెల్లంపల్లి చిన్న బ్రిడ్జి వద్ద జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...అద్దంకి మండలం కొంగపాడు గ్రామానికి చెందిన తమ్మవరపు వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మిలు ఒంగోలు వెళ్లి ఆస్పత్రిలో చూయించుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వాహనం రావడంతో వెల్లంపల్లి చిన్న బ్రిడ్జి వద్ద ఉన్న రెయిలింగ్‌ను వెంకటేశ్వర్లు ఢీకొట్టాడు. ప్రమాదంలో వెంకటేశ్వర్లు భార్య ఆదిలక్ష్మి పక్కనే ఉన్న మైలురాయిని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును ఒంగోలు జీజీహెచ్‌కి 108 వాహనంలో తరలించారు. మద్దిపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పుల్లలచెరువు: మండలంలోని కొండారెడ్డి కొట్టాల సమీపంలో బుధవారం కొండచిలువ కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కొండారెడ్డి కొట్టాలు గ్రామంలో తోట సమరసింహారెడ్డికి చెందిన కొట్టంలో కొండచిలువ దూరి కోడిని మింగింది. బుసలుకొడుతున్న శబ్ధం రావడంతో రైతు వెళ్లి చూడగా 10 అడుగుల మేర ఉన్న కొండ చిలువ కనిపించడంతో భయపడి బయటకు పరిగెత్తి చుట్టుపక్కల వారికి విషయం తెలియజేశాడు. స్నేక్‌క్యాచర్‌ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా కొండచిలువను బంధించి అడవిలో వదిలేశారు.

మార్కాపురం: రపభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు కావాలని డిమాండ్‌ చేస్తూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకింగ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద అన్ని బ్యాంకు ఉద్యోగులు బుధవారం నిరసన చేపట్టారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో 5 రోజుల పనిదినాలు అమల్లో ఉందని, మన దేశంలో కూడా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు కూడా వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు బ్యాంకులు ద్వారానే అమలు చేస్తున్న ఈ డిజిటల్‌ యుగంలో ఇంకా 5 రోజుల పనిదినాలు కల్పించకపోవడం శోచనీయమన్నారు. నిరసన కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కాశిరెడ్డి, గౌస్‌బాష, రామారావు, దిలీప్‌, గీతాంజలి, తారక్‌ యూనియన్‌ బ్యాంక్‌ఆఫ్‌ఇండియా నాయకులు గురవయ్య, ముంతాజ్‌ కరూర్‌ వైశ్యాబ్యాంక్‌ నాయకులు చైతన్య, రమణారెడ్డి హరిబాబు, ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి వేణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement