● సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన డీసీఓ శ్రీనివాసరావు
మద్దిపాడు: మండలంలోని దొడ్డవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో భారీ కుంభకోణంలో బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. సంఘంలో సుమారు రూ.4 కోట్ల మేర నిధుల అవకతవకలు జరిగాయంటూ ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ (డీసీఓ) శ్రీనివాసరావు ప్రాథమికంగా విచారణ చేపట్టారు. రూ.2 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆయన నిర్ధారించారు. దీంతో నిధుల గోల్‌మాల్‌కు బాధ్యురాలిగా చేస్తూ పీఏసీఎస్ కార్యదర్శి కె. శ్రీవాణిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, ఆమైపె కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పాలకవర్గ కమిటీ సభ్యులకు డీసీఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే పీఏసీఎస్ కమిటీ సభ్యులు సమావేశమై.. సస్పెన్షన్‌కు గురైన కార్యదర్శిపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
● సచివాలయ సేవల వల్లే మేదరమెట్లకు ఐఎస్‌ఓ గుర్తింపు
మేదరమెట్ల: వైఎస్సార్ సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తోంది. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించడంలో మెరుగైన పనితీరు కనబరిచిన మేదరమెట్ల పంచాయతీ ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ 9001:2015 సర్టిఫికెట్‌ను కై వసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న 23 పంచాయతీల్లో మేదరమెట్ల ఒకటి కావడం విశేషం. పారిశుధ్యం, రికార్డుల నిర్వహణ, అర్జీల పరిష్కారంలో చూపిన ప్రతిభకుగాను బుధవారం గ్రామ కార్యదర్శి లక్ష్మీకాంత్ రాష్ట్ర రాజధానిలో ఈ సర్టిఫికెట్ అందుకున్నారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఈ ఘనత సాధ్యమైందని మాజీ సర్పంచ్ బొనిగల ఎలీశమ్మ పేర్కొన్నారు. ‘జగనన్న నాటిన సచివాలయ వ్యవస్థ అనే విత్తనం నేడు పారదర్శక సేవలనే ఫలాలను ఇస్తోంది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ భద్రారెడ్డి సహకారంతోనే ఈ స్థాయికి చేరాం. ప్రభుత్వం మారినా సచివాలయాల కృషికి ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ గుర్తింపు రావడం ఎంతో గర్వకారణం’ అని ఆమె హర్షం వ్యక్తం చేశారు.


