ప్రొటోకాల్‌ మరిచిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ మరిచిన అధికారులు

Mar 20 2026 7:55 AM | Updated on Mar 20 2026 7:55 AM

ప్రొటోకాల్‌ మరిచిన అధికారులు దైవానుగ్రహంతో జిల్లా సుభిక్షం రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

మార్కాపురం: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో అధికారులు ప్రొటోకాల్‌ విస్మరించారు. పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అధికారులు టీడీపీ ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీల్లో ప్రచురించి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఫొటోను పెట్టలేదు. ఈ సంఘటన పలు విమర్శలకు తావిస్తోంది. మార్కాపురం జిల్లాలో మార్కాపురం పక్క నియోజకవర్గమైన యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఫొటోను ఫ్లెక్సీలో పెట్టకుండా గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేల ఫొటోలు మాత్రం ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. పొరపాటున చేశారా.. కావాలనే చేశారా.. అనే విషయం తెలియాల్సి ఉంది. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కావడంతో యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఫొటోను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒంగోలు సబర్బన్‌: దైవానుగ్రహంతో జిల్లా సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు ఉద్బోధించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఒంగోలులోని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాలులో ఘనంగా నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మంత్రి స్వామిలతో పాటు కలెక్టర్‌ పి.రాజాబాబు దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో తొలుత మంగళ వాయిద్యాలతో అధికారులు, నాయకులకు స్వాగతం పలికారు. ప్రముఖ వేద పండితుడు దక్షిణామూర్తి సంవత్సర పంచాంగ శ్రవణం చేయించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, ప్రజలను దక్షిణామూర్తి ఆశీర్వదించారు. వట్యం నాగేశ్వర విశ్వనాథ శర్మ, నాదెండ్ల నాగేశ్వరరావు, నడింపల్లి లక్ష్మీనారాయణ, పరాంకుశం శ్రీనివాసచార్యులకు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ తరఫున ఒక్కొక్కరికి రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వేదపండితులు షడ్రుచుల ఉగాది పచ్చడి అందజేశారు. వేడుకల్లో డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ పానకాలరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: ఇంటర్‌ మూల్యాంకనణం ఈ నెల 21వ తేదీ నుంచి నగరంలోని ఏకేవీకే జూనియర్‌ కళాశాలలో ప్రారంభమవుతుందని ఆర్‌ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ శనివారం నుంచి ఇంగ్లిష్‌, తెలుగు, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, హిందీ, ఒకేషనల్‌కు చెందిన ఇంగ్లిష్‌, జీఎఫ్‌సీ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, సీఎస్‌ఈ, లే, ఎల్‌ఎండీ కోర్సుల మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు. ఈ సబ్జెక్టులకు సంబంధించిన చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు తప్పక హాజరుకావాలన్నారు. 22వ తేదీన ఈ సబ్జెక్టులకు సంబంధించిన స్క్రుటినైజర్లు హాజరుకావాలన్నారు. అన్ని రకాల యాజమాన్యాల ప్రిన్సిపాళ్లు ఇంటర్‌ బోర్డు నుంచి ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఒక్కరినీ రిలీవ్‌ చేయాలని కోరారు. ఉత్తర్వులు అందుకొని మూల్యాంకనానికి గైర్హాజరైన సంబంధిత కళాశాల యాజమాన్యంపై ఇంటర్‌ బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement