గత ప్రభుత్వంలో 80 శాతం పనులు పూర్తయినా..
మార్కాపురంలో చంద్రబాబు ప్రభుత్వం 2018 నవంబరు 29న పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా టిడ్కో ఇళ్లను ప్రారంభించింది. పునాదులు తీసే సమయానికి ఎన్నికలు రావడంతో టిడ్కో ఇళ్ల పనులకు బ్రేక్ పడింది. 2019లో అధికారంలోనికి వచ్చిన వైఎస్సార్ సీపీ మొత్తం 912 మంది లబ్ధిదారులకు గృహాలు నిర్మించేందుకు అవసరమైన నిధులు రూ.62.2 కోట్లు కేటాయించింది. సుమారుగా రూ.45 కోట్లతో పనులు జరగగా 80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే 2024లో ఎన్నికలు రావడంతో జరగాల్సిన పనులు నిలిచిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నేటికీ 20 శాతం పనులను పూర్తిచేయక పోగా మౌలిక వసతులకు అవసరమైన నిర్మాణాలను కూడా చేపట్టలేదు. టిడ్కో ఇళ్లలో మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సౌకర్యం వంటి పనులను పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది. మౌలిక వసతుల కల్పనకు రూ.6.51 కోట్ల పనులు టెండర్ల స్థాయిలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు నాగులవరం రోడ్డులో టిడ్కో ఇళ్ల వద్ద చేపడతామని తెలుపగా ప్రభుత్వానికి ఆగస్టు 01 2018లో రూ.25 వేల డీడీని మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు ఇచ్చాను. ఇప్పటికి ఏడేళ్లు అవుతోంది. కనీసం రూపాయి వడ్డీతో కలిపినా రూ.22 వేలతోపాటు అసలు రూ.25 వేలు కలిపితే మొత్తం రూ.47 వేలు వచ్చింది. అయితే టిడ్కో ఇళ్లు ఇవ్వకపోగా చెల్లించిన డిపాజిట్లు తిరిగి ఇవ్వకపోవడంతో నాతోపాటు చెల్లించిన డిపాజిట్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు.
– వై నరేష్, లబ్ధిదారుడు, మార్కాపురం
గత ప్రభుత్వంలో 80 శాతం పనులు పూర్తయినా..
గత ప్రభుత్వంలో 80 శాతం పనులు పూర్తయినా..


