పిచ్చిచెట్లతో నిండిన టిడ్కో సముదాయాలు
గిద్దలూరు పట్టణంలో 2018 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం 1248 మందికి టిడ్కో గృహాలను ఇస్తామని చెప్పి వారి వద్ద నుంచి నగదు వసూలు చేసింది. 300 చదరపు అడుగులు ఉన్న గృహాలను ఒక్కొక్కరి వద్ద రూ.500 చొప్పున డిపాజిట్ చేయించారు. దాదాపు 864 మందిని గుర్తించి నగదును వసూలు చేశారు. సింగిల్‌బెడ్ రూం కింద 336 మందిని ఎంపిక చేసి రూ.15 వేలు వసూలు చేశారు. అలాగే డబుల్ బెడ్ రూం కింద 45 మంది వద్ద రూ.25 వేల చొప్పున అప్పటి అధికారులు తీసుకున్నారు. మొత్తం 4 కంతుల రూపంలో ఈ వసూళ్లు చేశారు. రూ.500 కట్టిన వారి మొత్తం రూ.4.32 లక్షలు, సింగల్‌బెడ్ రూం కోసం రూ.89.26 లక్షలు, డబుల్ బెడ్‌రూం కోసం రూ.97 లక్షలు లబ్ధిదారుల నుంచి వసూలు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులు పూర్తిచేసి తమకు గృహాలు వస్తాయన్న ఆశతో లబ్ధిదారులు ఎదురు చూసినా ఇంతవరకు వాటిని పట్టించుకోలేదు. ఈనేపథ్యంలో టిడ్కో గృహాల వద్ద కంపచెట్లు, వ్యర్థాలు పెరిగిపోయాయి. విష సర్పాలు సంచరిస్తున్నాయి.


