కనిగిరిలో చేసింది 65 శాతం పనులే..
నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలు
కనిగిరి పట్టణ సమీపంలోని చాకిరాల వద్ద నిర్మించిన 912 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వీటి కోసం రూ.66 కోట్లు కేటాయించి 65 శాతం పనులు పూర్తిచేశారు. టైల్స్, పెయింటింగ్, ఎలక్ట్రికల్, ఇతర ప్లంబింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిర్మాణాలు పూర్తి చేయాలంటే సుమారు రూ.28 కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మిగులు పనులు చేపట్టడంలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దీంతో టిడ్కో గృహాల నిర్మాణాల వద్ద పిచ్చి చెట్లు పెరిగి పాములు, విష సర్పాలకు నిలయంగా మారాయి. రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పది రోజులుగా హడావుడి చేస్తోంది. టిడ్కో, మున్సిపల్ అధికారులు పరిశీలనలు చేసి.. చిన్న చిన్న పనులు ప్రారంభించారు.


