కలగని మోక్షం! | - | Sakshi
Sakshi News home page

కలగని మోక్షం!

Jan 26 2026 6:40 AM | Updated on Jan 26 2026 6:40 AM

కలగని మోక్షం!

కలగని మోక్షం!

● పట్టణ ప్రాంతాల్లో అతీగతి లేని టిడ్కో గృహాలు ● 17 నెలలుగా ఆగిన ఇళ్ల నిర్మాణాలు ● పేదలను ఊరిస్తున్న సొంత ఇంటి కల ● గృహాల కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు ● పిచ్చిచెట్లు, విషసర్పాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం

● పట్టణ ప్రాంతాల్లో అతీగతి లేని టిడ్కో గృహాలు ● 17 నెలలుగా ఆగిన ఇళ్ల నిర్మాణాలు ● పేదలను ఊరిస్తున్న సొంత ఇంటి కల ● గృహాల కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు ● పిచ్చిచెట్లు, విషసర్పాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన వైనం
కలల సౌథం..

పట్టణ ప్రాంతాల్లో గృహాలు లేని పేదల ఆశలు నెరవేరుస్తామని హామీలు గుప్పించిన టీడీపీ ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనే ప్రహసనంగా మార్చిన గత టీడీపీ ప్రభుత్వం.. చివరికి ఒక్కరికి కూడా ఇంటిని మంజూరు చేయలేక చేతులెత్తేసింది. లబ్ధిదారుల వాటా సొమ్ము వసూలు చేయడంలో చూపిన శ్రద్ధ.. ఇళ్లను పూర్తి చేసి పేదలకు అప్పగించడంలో చూపకపోవడంతో నేటికీ మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో తగినన్ని నిధులు కేటాయించి పనులు పురోగతిలో ఉండగా ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు మరోసారి గద్దెనెక్కి 18 నెలలైనా టిడ్కో ఇళ్లపై ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గిద్దలూరులో టిడ్కో గృహాల చుట్టూ ఏపుగా పెరిగిన చిల్లచెట్లు

మార్కాపురం టౌన్‌/కనిగిరి రూరల్‌/గిద్దలూరు (బేస్తవారిపేట): పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల గూటికి చంద్రగ్రహణం పట్టింది. గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకోగా వాటిని తమ ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయ పడిన చంద్రబాబు ప్రభుత్వం.. టిడ్కో ఇళ్ల జోలికి మాత్రం పోలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, గిద్దలూరుల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 2017–18 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వాటిలో ఒక్క కందుకూరు తప్ప మిగిలిన ఏ ఒక్క చోట గృహాల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించిన దాఖలాలు లేవు. డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒంగోలు పట్టణంలోని పేదల కోసం రాజీవ్‌గృహకల్ప కాలనీ సమీపంలో, చింతల వద్ద 4128 లబ్ధిదారుల కోసం టిడ్కో ఇళ్లకు స్థలాలు కేటాయించి నిర్మాణాలు ప్రారంభించారు. అదేవిధంగా అద్దంకిలో శింగరకొండ అభయాంజనేయస్వామి గుడి సమీపంలో 1094 మందికి, కనిగిరి పట్టణ సమీపంలోని చాకిరాల వద్ద 912 మందికి, గిద్దలూరు పట్టణ పేదల కోసం గిద్దలూరు–కేఎస్‌పల్లి మధ్య ప్రభుత్వ స్థలంలో 1248 మందికి, మార్కాపురం పట్టణ పేదల కోసం నాగులవరం రోడ్డులో 912 మందికి టిడ్కో ఇళ్లు ప్రారంభించారు.

పేదల వద్ద వసూళ్లు..

టిడ్కో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను గుర్తించి వారి వాటాగా నగదు వసూలు చేశారు. ఈమేరకు లబ్ధిదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన టీడీపీ ప్రభుత్వం గృహాలను లబ్ధిదారులకు అందజేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కేవలం ఎన్నికలు, అధికారం కోసం కూటమి నాయకులు గతంలో ధర్నాలు చేయగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో గృహాల వైపు వెళ్లిన దాఖలాలు లేవు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో.. ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్‌..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కార్యక్రమంలో భాగంగా ఒక్క రూపాయికే టిడ్కో గృహాలను కేటాయించిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కింది. ఒక్క రూపాయితో పేదలకు ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి కొండంత భరోసా ఇచ్చారు. పేదోడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు తగిన మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. తుది దశ పనులు పూర్తయితే పేదలకు గూడు లభిస్తుంది. కానీ చంద్రబాబు సర్కార్‌ అలసత్వం వహించడంపై లబ్ధిదారులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement