ప్రపంచంలో నంబర్‌వన్‌ మోసగాడు బాబు | - | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో నంబర్‌వన్‌ మోసగాడు బాబు

Jan 27 2026 7:36 AM | Updated on Jan 27 2026 7:36 AM

ప్రపం

ప్రపంచంలో నంబర్‌వన్‌ మోసగాడు బాబు

ధైర్యంగా ఉండండి..అండగా ఉంటాం వ్యాన్‌ ఢీకొని వ్యక్తి మృతి

అవార్డులు అందుకుంటున్న డి.హిమవంశీ (సబ్‌కలెక్టర్‌, కందుకూరు), బి.చినఓబులేసు (డీఆర్‌ఓ), కె.లక్ష్మీప్రసన్న (ఆర్‌డీఓ, ఒంగోలు), టి.నారాయణ (పీడీ, డీఆర్‌డీఏ), కె.సుధాకర్‌రెడ్డి (ప్లానింగ్‌ డీఈఅండ్‌ఎస్‌ఓ), ఎం.వెంకటేశ్వరరావు (డీపీఓ), కె.అర్జున్‌నాయక్‌ (సోషల్‌ వెల్ఫేర్‌ ఈడీ), జె.పార్ధసారధి (మైనార్టీ వెల్ఫేర్‌ డీఎండబ్ల్యూఓ), ఎస్‌.పద్మశ్రీ(డీఎస్‌ఓ), ఎన్‌.లక్ష్మనాయక్‌(సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ), డాక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వరరావు (జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి), పి.నిర్మల్‌కుమార్‌ (ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ), డి.వరలక్ష్మి(ఇరిగేషన్‌ ఎస్‌ఈ), డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు(డీఎంహెచ్‌ఓ), కె.వెంకటేశ్వర్లు (ఏపీసీపీడీసీఎల్‌ ఎస్‌ఈ), వి.రామ్‌గోపాల్‌ నాయుడు (ట్రాన్స్‌కో ఎస్‌ఈ), జి.అశోక్‌ (పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ), పి.శ్రీమన్నారాయణ (స్టెప్‌ సీఈఓ,), ఎల్‌.శంకరనారాయణరెడ్డి(స్టేట్‌ ఆడిట్‌ఆఫీసర్‌), ఎ.జగన్నాథరావు(ట్రెజరీస్‌ డీడీ), ఎం.పానకాలరావు (దేవాదాయశాఖ ఏసీ), కె.రాజశేఖర్‌రావు (డీఎఫ్‌ఓ, సోషల్‌ఫారెస్ట్‌), కె.వినోద్‌కుమార్‌ (డీఎఫ్‌ఓ, ప్రాదేశిక), సీహెచ్‌.శ్రీనివాసరావు (జిల్లా మత్స్య శాఖాధికారి), వైఎంఎన్‌వీఎస్‌ గోపిచంద్‌ (జిల్లా ఉద్యానశాఖ అధికారి), సీహెచ్‌ శ్రీనివాసులు(పీడీ, ఏపీఎంఐపీ), డి.రమేష్‌(ఎల్‌డీఎం, కెనరా బ్యాంక్‌), ఎం.వరలక్ష్మి (మార్కెటింగ్‌ అధికారి), కె.హరిక్రిష్ణ (డీఎం, మార్క్‌ఫెడ్‌), సీహెచ్‌ సువార్త (ఏడీ, దివ్యాంగుల శాఖ) , టి.శ్రీనివాస సంజయ్‌ (ఈఈ, పబ్లిక్‌హెల్త్‌), కె.శ్రీనివాసరెడ్డి (జిల్లా అగ్నిమాపకశాఖాధికారి), ఎస్‌.జాన్సన్‌ (ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌), జె.రవికుమార్‌ (నాబార్డ్‌ డీడీఎం,), కె.ఆంజనేయులు (జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖఅధికారి), కె.బాలంజనేయులు (జిల్లా రిజిష్ట్రార్‌), డాక్టర్‌ జి.పద్మజ (ఆర్‌డీడీ, ఆయూష్‌), జి.సత్యనారాయణ (ఆర్‌ఎం, ఏపీఎస్‌ ఆర్టీసీ, ఎ.కళావతి (డిప్యూటీ కలెక్టర్‌, బీకేవీ), జీహెచ్‌.విజయజ్యోతికుమార్‌ (డిప్యూటీ కలెక్టర్‌, కేఓఆర్‌జీపీ) , వి.సుభాషిణి(డీపీఎం), ఎం వెంకటేష్‌ (డీఆర్‌ఓ సీసీ), ఆర్‌ శ్రీనివాసరావు (డీఎస్పీ, ఒంగోలు), బి.లక్ష్మీనారాయణ (ఎస్‌డీపీఓ, దర్శి), కె.శ్రీనివాసరావు (డీఎస్పీ, ఏఆర్‌),

టి.విజయక్రిష్ణ (సీఐ, ఒంగోలు తాలుకా), జి.సోమశేఖర్‌ (సీఐ, కొండపి), ఓ.దుర్గాప్రసాద్‌ (సీఐ, ఎస్సీ, ఎస్టీ సెల్‌), పి. దేవప్రభాకర్‌ (సీఐ, డీసీఆర్‌బీ, ఒంగోలు), ఎస్‌వీ రమణ (ఆర్‌ఐ ఏఆర్‌), యు.సుధాకర్‌రావు (సీఐ, టాస్క్‌ఫోర్స్‌), వై.రామారావు (సీఐ, దర్శి), వై.నాగరాజు (ఎస్సై, బల్లికురవ), వి.వెంకటేశ్వరరావు (ఎస్సై, డీసీఆర్‌బీ, ఒంగోలు), జి.వెంకటసూర్య (ఎస్సై, మద్దిపాడు), బి.ప్రేమ్‌కుమార్‌ (ఎస్సై,కొండపి), ఎస్‌కే మహ్మద్‌రఫీ (ఎస్సై, మేదరమెట్ల), బి.ఫణిభూషణ్‌ (ఎస్సై, ఒంగోలు తాలుకా), పి.జనార్దన్‌రావు (ఎస్సై, పీజీఆర్‌ఎస్‌ సెల్‌), వై.మాధవరెడ్డి(డీఎస్పీ, పీటీసీ), ఎస్‌కే . షఫీఅహ్మద్‌ (సీఐ, పీటీసీ), ఎన్‌.శ్రీనివాసరావు (జైలర్‌),

పి.రవికుమార్‌ (ఎంవీఐ) , కలెక్టర్‌, ఎస్పీ చేతుల మీదుగా మెడల్స్‌ అందుకుంటున్న ఎం.భీమానాయక్‌ (సీఐ), యు.జనార్దన్‌రావు(కానిస్టేబుల్‌), ఎ.సూర్యనారాయణ (ఏఎస్సై), ఐ.మాల్యాద్రి(ఏఎస్సై)

జి.మోహన్‌రావు (ఏఎస్సై), వి.గౌతమి(ఏఎస్సై)జి.సుధాకర్‌ (హెడ్‌కానిస్టేబుల్‌), ఎం.అశోక్‌కుమార్‌ (కానిస్టేబుల్‌), ఏ.వెంకటప్రసాద్‌( ఏఆర్‌ కానిస్టేబుల్‌)

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి

ఒంగోలు టౌన్‌: ధైర్యంగా ఉండండి, పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ముండ్లమూరు మండలం శంకరాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఉల్లగళ్లు ఎస్సీ కాలనీకి చెందిన తప్పేట రాజ్యంను సోమవారం ఆయన పరామర్శించారు. రాజ్యం ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్థికసాయం అందజేశారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు. బూచేపల్లితో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు వున్నారు.

అద్దంకి రూరల్‌: బైకును వ్యాన్‌ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అద్దంకిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకికి చెందిన వి. చిరంజీవి(43) బంగారపు పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం అద్దంకి బస్టాండ్‌లో తన బంధువులను బస్సు ఎక్కించి తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలోని స్థానిక పాతపెట్రోలు బంకు వద్దకు రాగానే రాజస్థాన్‌కు చెందిన వ్యాన్‌ వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. దీంతో చిరంజీవి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కందుకూరు: ఒక అబాద్ధాన్ని నిజం చేయడంలో, ఉన్నది లేనట్లు చూయించి ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని మించిన వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరొకరు ఉండరని, నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం చంద్రబాబునాయుడికి మాత్రమే సాధ్యమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ కమిటీల ఏర్పాటుపై సోమవారం స్థానిక వెంగమాంబ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సంక్షేమంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. అయితే వాటిని సక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమడం వల్లే పార్టీ ఓడిపోయిందన్నారు. 17 మెడికల్‌ కాలేజీలను జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణం చేపడితే చంద్రబాబు, లోకేష్‌ తమ డబ్బు పిచ్చి వల్ల వాటిని ప్రైవేటీకరణ పేరుతో తన సొంత మనుషులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందన్నారు. ఎన్నికల ముందుకు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి నేడు అదే చంద్రబాబు అప్పట్లో జగన్‌వాడిన బ్లాక్‌చైన్‌ టెక్నాలజీనే వాడి పాస్‌పుస్తకాలను ముద్రిస్తున్నారని చెప్పారు. నాడు జగన్‌ రేషన్‌ బియ్యం, పింఛన్లు డోర్‌ డెలివరీ చేస్తే కూటమి ప్రభుత్వం మద్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. చంద్రబాబు చెప్పిన ఇరవైమూడు లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.18వేలు, ఉచిత సిలిండర్‌ ఎక్కడ ఉన్నాయో సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. రైతులకు సక్రమంగా యూరియా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని, కౌలు రైతులను ఆదుకునే నాథుడే లేడన్నారు. ఇన్ని తప్పులు చేస్తూ ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌ ఎటు పోయారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉందన్నారు.

ఇబ్బంది పెట్టే ఏ అధికారిని వదలం

కూటమి ప్రభుత్వం అండచూసుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఏ పోలీస్‌ని, ఇతర అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నమోదు చేస్తున్నామని, ఏ పోలీస్‌ అధికారి ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తున్నామన్నారు. ఇటువంటి పోలీసులకు అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల పాటు ఎక్కడా పోస్టింగ్‌ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ దాడులను ధైర్యం ఎదుర్కొవాలని, భయపడాల్సిన అవసరమే లేదన్నారు.

10వేల మందితో కమిటీలు

వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో 10వేల మంది వివిధ విభాగాల కమిటీలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది కార్యకర్తల సైన్యం వైఎస్సార్‌ సీపీకి ఉంటుందని, ప్రపంచంలో ఏ పార్టీకి ఇటువంటి సంస్థాగత నిర్మాణం ఉండదన్నారు. కమిటీల్లో కార్యకర్తలను పార్టీ ప్రత్యేకంగా గుర్తించి భవిష్యత్‌లో పదవుల్లోకి వీరికే ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. కందుకూరు నియోజకవర్గంలో వెంటనే కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. వచ్చే ప్రభుత్వంలో కార్యకర్తకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని, కార్యకర్తల అండతో నాయకుడు నడిచే పరిస్థితి రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని సూచించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన..

జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు, చంద్రబాబునాయుడు పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, బియ్యం వంటి వాటిని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. జగన్‌ నిజమైన సంపద సృష్టిస్తే, చంద్రబాబు సూపర్‌సిక్స్‌ పథకాలపేరుతో మోసం చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యన్నారాయణరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధ్యానం ఉంటుందన్నారు.

నియోజకవర్గంలో సామంతరాజుల పాలన నడుస్తుంది

కందుకూరు నియోజకవర్గంలో మండలానికో ఇన్‌చార్జి పెట్టి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు భారీ అవినీతికి పాల్పడుతున్నారని బుర్రా మధుసూదన్‌యాద్‌ ఆరోపించారు. ఇసుక, పేకాట, మట్టి, బియ్యం వంటివాటిలో ఎమ్మెల్యేకి వాటాలు ఉన్నాయని చెప్పారు. ఈ పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు సూచించినా మారే పరిస్థితి లేదన్నారు. ఆయన ఎన్నికల్లో చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారని వివరించారు. వైఎస్సార్‌ సీపీకి అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కులాలు, మతాలకు అతీతంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్కరికీ మేలు చేశారని, జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు బలంగా పనిచేసి నియోజకవర్గంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేషయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, కందుకూరు టౌన్‌, రూరల్‌, ఉలవపాడు, వలేటివారిపాలెం, గుడ్లూరు, లింగసముద్రం మండలాల కన్వీనర్‌లు షేక్‌ రఫి, ఈదర రమేష్‌, నన్నంపోతురాజు, అనుమోలు లక్ష్మీనరసింహం, కాపులూరి క్రిష్ణ, నోటి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీలు పులిరమేష్‌, పెన్నా క్రిష్ణయ్య, వివిధ విభాగాల అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం, తోకల కొండయ్య, వల్లూరి కోటేశ్వరరావు, సాంబశివరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలో నంబర్‌వన్‌ మోసగాడు బాబు 1
1/1

ప్రపంచంలో నంబర్‌వన్‌ మోసగాడు బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement