పార్టీ కోసం శ్రమించే వారికి ప్రాధాన్యం
కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే విజయం సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: పార్టీ కోసం శ్రమించే ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని, గ్రామస్థాయి కార్యకర్తలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన ఫలితం దక్కుతుందన్నారు. అధికారంలో లేనిసమయంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే వారే నిజమైన నాయకులని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని, జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకొని ప్రజా సంక్షేమానికి పాటు పడదామని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఉన్న పంచాయతీల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలన్నారు. పార్టీ పదవులు పొందినవారు పార్టీ పరంగా జరిపే ప్రతి కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. టీడీపీ వర్గీయులు తమ స్థాయిని మరచి విమర్శలకు దిగుతున్నారని, వారికి ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులే గట్టి సమాధానం ఇవ్వాలని సూచించారు. టీడీపీకి చెందిన ఎంపీటీసీనే.. ఎంపీడీవో అవినీతిపరుడని ఆరోపించడం వారి పాలనకు అద్దం పడుతోందని, నియోజకవర్గ ఇన్‌చార్జి అంటూ తిరుగుతున్న ఆ పార్టీ నాయకుడు ఇసుక, మట్టి, బియ్యం అక్రమ రవాణాచేసే వారిని వెంటేసుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటుచేసి ఇటువంటి సంఘటనలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ప్రజా ప్రతినిధిలు, పార్టీ నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, ఉడుముల అరుణ, ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, పి.కృష్ణారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఐవీ.సుబ్బారావు, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, వాడాల పద్మా, కె.ఓబులరెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, వాగ్యానాయక్, సయ్యద్ జబీవుల్లా, తోకల ఆవులయ్య, యేర్వ శేషసేనారెడ్డి, అంగిరేకుల ఆదినారాయణ, జానకి రఘు, ఎల్.రాములు, షేక్.కాశింపీరా, పి.రాములు నాయక్, వెన్నా మోహన్‌రెడ్డి, ఎం.ఆదిశేషు, ఒంటేరు నాగేశ్వరరావు, చిట్టె వెంకటేశ్వరరెడ్డి, పబ్బిశెట్టి మల్లికార్జున్, కందూరి రామయ్య, కందూరి కాశీవిశ్వనాథ్, ఐవీ.సత్యనారాయణ, పి.రాములు నాయక్, సాయపనేని సుబ్బారావు, షేక్.షెక్షావలి, రామయ్య పాల్గొన్నారు.


