చెరువులో జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో జారిపడి వ్యక్తి మృతి

Jan 27 2026 7:36 AM | Updated on Jan 27 2026 7:36 AM

చెరువ

చెరువులో జారిపడి వ్యక్తి మృతి

చెరువులో జారిపడి వ్యక్తి మృతి రెండో రోజూ దొరకని ఆచూకీ యథేచ్ఛగా మద్యం, మాంసం విక్రయాలు ఎకై ్సజ్‌ సీఐకి రాష్ట్రస్థాయి అవార్డు మోటార్‌ సైకిల్‌, స్కూల్‌ బస్సు ఢీ

కొండపి: చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొండపి చెరువులో సోమవారం జరిగింది. పోలీసులు వివరాల మేరకు..కొండపి జాళ్లపాలెం రోడ్డులో ఉండే గురునాథం పాల్‌(52) శుక్రవారం రాత్రి మలవిసర్జన నిమిత్తం చెరువు కట్ట దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు శనివారం, ఆదివారం డ్రోన్ల సాయంతో గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మృతదేహం చెరువులో తేలాడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కొండపి ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. మృతునికి భార్య, 10 మంది పిల్లలు ఉన్నారు.

కంభం: కంభం చెరువులో ఆదివారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు కొనసాగించారు. రెండో రోజు సోమవారం ఉదయం నుంచి చెరువులో గాలించారు. అయితే చెరువులో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు ఇబ్బందిగా మారింది. అయితే గల్లంతైన వ్యక్తి ఎవరో ఇంకా స్పష్టత రాలేదు. కందులాపురం పంచాయతీకి చెందిన వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రానున్నట్లు సమాచారం.

గిద్దలూరు రూరల్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం, మాంసం విక్రయించడం చట్టరిత్యా నేరం. అయితే సోమవారం గిద్దలూరు పట్టణంలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి. పాములపల్లె రోడ్డులో చేపలను బహిరంగంగా విక్రయించారు. మద్యం ప్రియులకు అందుబాటులో కమ్మరాంకట్ట సెంటర్‌, రాచర్ల గేటు సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లలో బెల్టుషాపు నిర్వాహకులు మద్యం విక్రయించారు. ఇంత జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్తెత్తి కూడా చూడలేదు.

సింగరాయకొండ: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ ఎం శివకుమారి రాష్ట్రస్థాయి ప్రశంశా అవార్డు అందుకున్నారు. సర్కిల్‌ పరిధిలో అత్యధిక కేసులు నమోదు చేయడంతో పాటు ముఖ్యంగా గోవా మద్యం పట్టుకున్న కేసులో అవార్డు లభించింది. జిల్లాలో ఏకై క సర్కిల్‌ స్థాయి అధికారిగా అవార్డుకు ఎంపికయ్యారు. విజయవాడ ఎకై ్సజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

ఇద్దరికి తీవ్ర గాయాలు

పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న మోటారు సైకిల్‌, స్కూల్‌ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నగుడిపాడు సమీపంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు..పెద్ద బొమ్మలాపురం నుంచి వస్తున్న ఓ పాఠశాల బస్సును పొలాల నుంచి వస్తున్న మోటారుసైకిల్‌ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌పై ఉన్న గిలకా చిన్నకోటయ్య, గిలకా పెద్దిరాజులకు తీవ్ర గాయాలు కావడంతో సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేటకు తరలించారు.

చెరువులో జారిపడి వ్యక్తి మృతి 1
1/3

చెరువులో జారిపడి వ్యక్తి మృతి

చెరువులో జారిపడి వ్యక్తి మృతి 2
2/3

చెరువులో జారిపడి వ్యక్తి మృతి

చెరువులో జారిపడి వ్యక్తి మృతి 3
3/3

చెరువులో జారిపడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement