అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
ఒంగోలు సిటీ: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆలోచనా విధానాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో 77వ గణతంత్ర దిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, హోదాలు దక్కాలని, ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్ధికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ దేశ పౌరుడిగా చట్టాలను కాపాడుకుంటూ, ప్రతి ఒక్కరి హక్కులను గౌరవిస్తామని తెలిపారు. దేశం కోసం తమ ప్రాణాలర్పించిన మహానీయుల అడుగు జాడల్లో నడవాలని, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, బొట్ల రామారావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ వైఎం.ప్రసాద్‌రెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దామరాజు క్రాంతి కుమార్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షురాలు గోనుగుంట రజని, మహిళా నాయకులు బత్తుల ప్రమీల, పేరం ప్రసన్న, షేక్ అప్సర్, మాధవీలత, శోభాలత, విజయ, రాజేశ్వరి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహాగౌడ్, వైఎస్సార్ సీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, మల్లిశెట్టి దేవా, రొండా అంజిరెడ్డి, షేక్ నాగూర్, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, చందోలు చెంచిరెడ్డి, వెంకటరెడ్డి, ఎదురు మాల్యాద్రిరెడ్డి, ఫణిదపు సుధాకర్, తాతా నాంచారులు, తుళ్లూరి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.


