మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
– 8లో..
ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్, పక్కన ఎస్పీ, జేసీ జిల్లాను సమగ్రాభివృద్ధి చేస్తామన్న కలెక్టర్ రాజాబాబు ఆకట్టుకున్న పోలీసుల కవాతు, పోలీసులు సాహసాలు అలరించిన దేశభక్తి గీతాలు...శకటాల ప్రదర్శన
ఆలకూరపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల నృత్య రూపకం
మార్మోగిన దేశభక్తి..
మురిసిన త్రివర్ణం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని, అన్ని వర్గాల వారు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ పి.రాజాబాబు విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఎస్పీ వి.హర్ష వర్ధన్‌రాజుతో కలిసి పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో పర్యటించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమర యోధులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా తలసరి అంచనా ఆదాయం రూ.2,15,240 ఉండగా 15 శాతం వృద్ధి రేటుతో 2028–29 కు రూ.4,27,409 కు పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. మన జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని రాబోయే ఐదేళ్లలో 15 శాతం వృద్ధి రేటు సాధించడానికి తయారుచేసిన ‘డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్’ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం పొందిందన్నారు. అలాగే జిల్లాలోని 6 నియోజకవర్గాలకు ‘విజన్ యాక్షన్ ప్లాన్’ అమలుకు శాసన సభ్యుల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సహజ వనరుల నిర్వహణ (ఎన్‌ఆర్‌ఎం) విభాగం కింద ప్రాజెక్ట్ ప్రాంతంలో రూ.2.81 కోట్ల వ్యయంతో 188 పనులు చేపట్టామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు నల్లమల సాగర్ వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి 904 గ్రామాలు, రామతీర్ధం రిజర్వాయర్ నుంచి 318 గ్రామాలు, గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 198 గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు పరిపాలన అనుమతి నిమిత్తం ప్రతిపాదనలకను ఈఎన్‌సీకి పంపామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ, డీఆర్‌ఓ బీసీహెచ్.ఓబులేసు, ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు అర్బన్, రూరల్ తహశీల్దార్లు పిన్నిక మధు సూదనరావు, రహంతుల్లా, ఆర్‌ఐ శ్రీకంఠ శ్రీనివాస రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఒంగోలు సబర్బన్: పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఒంగోలులోని డ్రీమ్స్ హైస్కూల్, అపెక్స్ హైస్కూల్, అన్నవరప్పాడులోని సూర్య హైస్కూల్, కొత్తపట్నం, తాళ్లూరు, ముండ్లమూరు, పొన్నలూరు, కే బిట్రగుంట కేజీబీవీలు, టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, క్విస్, పేస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులచే దేశభక్తి ఉట్టిపడేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొత్తపట్నం, తాళ్లూరు, ముండ్లమూరు, పొన్నలూరు, కే బిట్రగుంట కేజీబీవీ విద్యార్ధులు ప్రదర్శించిన ‘రెపరెపలాడే జెండా’ ప్రదర్శనకు మొదటి బహుమతి లభించగా, డ్రీమ్స్ హైస్కూల్, టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలకు సంయుక్తంగా ద్వితీయ బహుమతి, సూర్య హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనకు తృతీయ బహుమతి లభించాయి. అపెక్స్ హైస్కూల్ విద్యార్థులు, క్విస్, పేస్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల ప్రదర్శనలకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు:
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల్లో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లా పంచాయతీరాజ్ శాఖ శకటానికి మొదటి బహుమతి, జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటాలకు సంయుక్తంగా రెండో బహుమతి, సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్, ఐటీడీఏ సంక్షేమ శాఖల శకటానికి తృతీయ బహుమతి, జిల్లా ప్రజా రవాణ, విద్య, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖల శకటాలకు ప్రోత్సాహక బహుమతి లభించింది.
● వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రజలు, విద్యార్థులు స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించారు. భూగర్భ గనుల శాఖ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు సంయుక్తంగా మొదటి బహుమతి లభించగా, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు సంయుక్తంగా రెండో బహుమతి, పశు సంవర్ధక శాఖ, స్టెప్ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు సంయుక్తంగా తృతీయ బహుమతి లభించాయి.
ప్రపంచంలో నంబర్ వన్ మోసగాడు బాబు
ప్రజలను మోసగించడంలో ప్రపంచంలో నంబర్ వన్ వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
దేశభక్తి జ్వాలలు ఎగసిపడుతూ, సాంస్కృతిక సంప్రదాయాల వైభవం మెరిసిపోతూ గణతంత్ర వేడుకలు ప్రాంగణాన్ని ఉల్లాసంగా మార్చాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా సాగాయి. త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపనతో వాతావరణం దేశభక్తితో మార్మోగింది. విద్యార్థుల ఉత్సాహభరిత సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో అసమాన ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, అధికారులను ప్రశంసా పత్రాలతో సత్కరించి ప్రోత్సహించారు.
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026


