రాయవరంలో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత
మార్కాపురం రూరల్ (మార్కాపురం): మండలంలోని రాయవరం గ్రామంలో ఈ నెల 21వ తేదీ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. శుక్రవారం గమనించిన వైఎస్సార్ సీపీ నాయకులు స్థానిక రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుచే శారు. గ్రామ నడిబొడ్డున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ పి.వెంకట సుబ్బమ్మ, డి.పెద్దమల్లయ్య, అడివయ్య తదితరులు ఏర్పాటు చేశారు. అయితే, గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఫ్లెక్సీలను చూసి సహించలేక అర్ధరాత్రి సమయంలో చించివేశారు. శుక్రవారం ఉదయానికి ఫ్లెక్సీలు చించివేసి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో గ్రామంలో టీడీపీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని, ఎటువంటి ఆటంకం తాము కలిగించలేదని తెలిపారు. మళ్లీ రాయవరం గ్రామంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జి.రామచంద్రారెడ్డి, ఎస్.వెంకటరెడ్డి తదితరులు కోరారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలకు ఆస్కారం ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు
రాయవరంలో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల చించివేత


