ఫైనాన్స్‌ మోసం కేసులో కలెక్షన్‌ ఏజెంట్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ మోసం కేసులో కలెక్షన్‌ ఏజెంట్‌ అరెస్టు

Dec 27 2025 6:59 AM | Updated on Dec 27 2025 6:59 AM

ఫైనాన

ఫైనాన్స్‌ మోసం కేసులో కలెక్షన్‌ ఏజెంట్‌ అరెస్టు

ఫైనాన్స్‌ మోసం కేసులో కలెక్షన్‌ ఏజెంట్‌ అరెస్టు విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం

మార్కాపురం టౌన్‌: పట్టణంలోని బజాజ్‌ ఫైనాన్స్‌లో కలెక్షన్‌ ఏజెంటుగా పనిచేస్తూ ఖాతాదారుల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును సంస్థకు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన దేవండ్ల శ్రీను బజాజ్‌ ఫైనాన్స్‌లో కలెక్షన్‌ ఏజెంటుగా పనిచేస్తూ ఖాతాదారులు చెల్లించిన సుమారు 6 లక్షల రూపాయల సొమ్మును సంస్థకు చెల్లించలేదని మేనేజర్‌ నాగిశెట్టి లక్ష్మీనారాయణ గత నెల 17వ తేదీ మార్కాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితుడు శ్రీనును అరెస్టు చేసినట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు.

కొమరోలు: పొలంలో రాత్రివేళ కాపలా ఉండడానికి వెళ్లిన ఓ రైతు విద్యుత్‌ షాక్‌తో మృతిచెందాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని పొట్టిపల్లె గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం గుమ్మళ్లపల్లె గ్రామానికి చెందిన గుమ్మల రామయ్య (27) పొట్టిపల్లె గ్రామ సమీపంలో పొలం కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. రోజూలాగే రాత్రివేళ పొలంలో కాపలా ఉండటానికి గురువారం రాత్రి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో మోటారు వద్ద లైట్‌ వెలగకపోవడంతో అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నాడు. అక్కడ తెగిపోయిన విద్యుత్‌ వైరు కాలికి తగిలి విద్యుత్‌ షాక్‌తో అక్కడికక్కడే రామయ్య మృతిచెందాడు. స్థానిక ఎస్సై నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు వైద్యశాలకు తరలించారు.

మేదరమెట్ల:ఓ వ్యక్తి తన తమ్ముడు వద్దకు వెళ్లి మోటారు బైక్‌పై తిరిగి వస్తుండగా ఆటో ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కొరిశపాడు మండల పరిధిలోని రావినూతల–దైవాలరావూరు రోడ్డులో గురువారం రాత్రి జరిగింది. కొరిశపాడు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బల్లికురవ మండలం చినమల్లాయపాలెం గ్రామానికి చెందిన తంగిరాల వంశీ (24) మోటారు బైక్‌పై కొరిశపాడు మండలంలోని కనగాలవారిపాలెంలో తమ్ముడిని కలిసి తిరిగి వస్తున్నాడు. బైక్‌పై రావినూతల శివారులో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన ఆటో బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంశీ తల, మెడ, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు.

ఫైనాన్స్‌ మోసం కేసులో కలెక్షన్‌ ఏజెంట్‌ అరెస్టు 1
1/1

ఫైనాన్స్‌ మోసం కేసులో కలెక్షన్‌ ఏజెంట్‌ అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement