జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఒంగోలు వన్‌టౌన్: కరుణామయుడు, లోక రక్షకుడు ఏసు ప్రభువు జన్మించిన పర్వదినం క్రిస్మిస్ పండుగను జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ పీ రాజబాబు బుధవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. శాంతి, దయ, ప్రేమ, ధర్మం, న్యాయం, అహింస, పరోపకారం వంటి ఏసు క్రీస్తు బోధనలు, సర్వ మానవాళికి ఆచరణీయమని అన్నారు.
క్రీస్తు జననం..మానవాళికి మహోదయం
ఒంగోలు టౌన్: ఏసు క్రీస్తు జననంతో యావత్ ప్రపంచంలోని ప్రజల జీవితాల్లో వెలుగులు విరజిల్లాయని ఎస్పీ హర్షవర్థన్ రాజు చెప్పారు. జిల్లా ప్రజలందరికీ, పోలీసు సిబ్బందికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఎస్పీ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన ఏసు క్రీస్తు మార్గం ఆచరణీయమైనదని చెప్పారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, త్యాగం వంటివి క్రీస్తు ఆచరించి చూపారన్నారు. జిల్లా ప్రజలు క్రిస్మస్ పండుగను సంతోషకరమైన వాతావరణంలో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన చర్చిలు, ప్రార్ధనా మందిరాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు


