నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక
దొనకొండ:
ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నెట్‌బాల్ బాల బాలికల జట్టును స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఎంపిక చేశారు. జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషుల విభాగంలో బి.ప్రకాష్, కె.విజయ్, జె.జాషువా, వై.పూర్ణ, ఏ.కిరణ్‌కుమార్, ఏ.జగదీష్, వి.రాఘవేంద్ర, ఎం హేమంత్, ఐ.కిషోర్, ఎం జనార్దన్, పి.మునీంద్ర, పి.జావీద్, స్టాండ్‌బైగా ఏ.గోపి, బి.రామక్రిష్ణారెడ్డి, డి.లక్ష్మీరెడ్డిలు ఎంపికయ్యారు.
మహిళల విభాగంలో..
శ్రావణి, అనుష్క, శివమ్మ, గిరిజ, శివలక్ష్మి, నాగదివ్య, విజయలక్ష్మి, మధుశాలిని, శ్రీదేవి, బషీరా, త్రివేణి, గురులక్ష్మీలు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు కె.నరసింహారావు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29 వరకు ఈస్ట్‌గోదావరి రావులపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని అధ్యక్ష, కార్యదర్శులు ఎం కృష్ణారెడ్డి, ఐపీ రాజు తెలిపారు. ఎంపికలకు ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు కాలే నరసింహారావు, బొరిగొర్ల మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఒంగోలు:
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రెండో అదనపు జిల్లా జడ్జి పి.లలిత బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..మద్దిపాడు మండలం రాచవారిపాలెంకు చెందిన సుభాషిణికి కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన తావేటి కృపారావుతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన కృపారావు భార్యపై అనుమానం పెంచుకొని నిత్యం వేధించేవాడు. దీంతో సుభాషిణి అదే గ్రామంలో నివాసం ఉంటున్న సోదరి ఇంట్లో తలదాచుకుంది. భార్యపిల్లలను వదిలిపెట్టి కృపారావు హైదరాబాద్‌లో ఉంటూ పెద్ద మనుషులతో కాపురానికి రావాలని ఒత్తిడి తెచ్చాడు. అతని మాటలు నమ్మి కాపురానికి వచ్చిన సుభాషిణిని 2015 డిసెంబర్ 24న రోకలిబండతో కొట్టి హతమార్చాడు. దీనిపై సుభాషిణి తల్లి జగన్నాథం లక్ష్మీ నారాయణమ్మ ఫిర్యాదు చేయగా అప్పటి టూటౌన్ సీఐ దేవప్రభాకర్ కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.
ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించకుంటే 2 నెలలు అదనంగా జైలుశిక్ష చేయాలని ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరుపున అదనపు పీపీలు యత్తపు కొండారెడ్డి, కేవీ రామేశ్వరరెడ్డి వాదించగా కోర్టు లైజన్ కె.లక్ష్మీనారాయణ, వి.ప్రసాద్ సాక్షులు సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చేసి నేర నిరూపణకు సహకరించారు.


