జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు రావిపాడు ప్రాజెక్ట్
కంభం: రావిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.మధుసూదనరావు తయారు చేసిన ‘స్మార్ట్ మైక్రోస్కోప్’ ప్రాజెక్ట్ జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎంపికై ందని మండల విద్యాశాఖాధికారి అబ్దుల్ సత్తార్ తెలిపారు. ప్రాజెక్ట్ ఎంపికై న నేపథ్యంలో ఉపాధ్యాయుడు మధుసూదనరావు టీమ్ ను ఎంఈఓ, అధ్యాపకులు, యూటీఎఫ్ నాయకులు అభినందనలు తెలిపారు.
ఒంగోలు టౌన్: సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 26, 27 తేదీల్లో జిల్లాలో సీఐటీయూ నిర్వహించనున్న ప్రచార జాతాను విజయవంతం చేయాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతా వివరాలను వెల్లడించారు. రెండు బృందాలుగా జాతా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక బృందం 26వ తేదీ ఉదయం పామూరులో ప్రచార జాతా ప్రారంభించి కనిగిరి, పొదిలి, కురిచేడు, దొనకొండ, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు గ్రామాల మీదుగా మార్కాపురం చేరుకుంటుందని తెలిపారు. 27 ఉదయం మార్కాపురం నుంచి ప్రారంభమయ్యే జాతా తర్లుపాడు, కంభం, గిద్దలూరు, బేస్తవారిపేట, హనుమంతునిపాడు, వెలిగండ్ల మీదుగా సీఎస్‌పురం చేరుకుంటుందని తెలిపారు. రెండో బృందం ఒంగోలు డివిజన్‌లో విస్తృతంగా పర్యటిస్తుందని, అనంతరం కొత్తపట్నం మండలంలోని ముఖ్య ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక చట్టాలను తిప్పికొట్టేందుకు, ఆంధ్రుల హక్కుగా పరిగణిస్తున్న విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు అవసరమైన చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సాగించే ఉద్యమాలకు ఈ సభలు ఊతం ఇస్తాయన్నారు. జిల్లా నలుమూలల నుంచి కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ పాల్గొన్నారు.
జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు రావిపాడు ప్రాజెక్ట్


