బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

Dec 26 2025 8:40 AM | Updated on Dec 26 2025 8:40 AM

బెల్ట

బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

105 క్వార్టర్‌ బాటిళ్లు, 10 బీర్‌ బాటిళ్లు స్వాధీనం ఐదుగురు బెల్ట్‌షాపు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల

ఒంగోలు టౌన్‌:

జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝళిపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మెరుపుదాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నారు. ఎస్పీ హర్షవర్థన్‌ రాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ సుధాకర్‌ బృందం గురువారం ఒంగోలు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఒంగోలు మండలంలోని మద్దిరాలపాడు, నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ, మద్దిపాడు మండలంలోని మేదరమెట్ల, కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. 105 క్వార్టర్ల మద్యం బాటిళ్లు, 10 బాటిళ్ల బీర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు మండలంలోని మద్దిరాలపాడు గ్రామ హైవే వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఐదు 180 ఎంఎల్‌ క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో అప్పగించారు. మద్దిపాడు మండల పరిధిలోని గుండ్లాపల్లి హైవే రోడ్డుపై మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తి నుంచి 45 క్వార్టర్‌ బాటిళ్లు, మరో వ్యక్తి నుంచి 18 క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నాగులుప్పలపాడు మండలంలోని చదలవాడ గ్రామంలోని చీరాల రోడ్డులో మద్యం విక్రయిస్తున్న నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 6 క్వార్టర్ల మద్యం బాటిళ్లు, 10 బీర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామంలో మరోసారి భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. గతంలో ఎస్‌టీఆర్‌ఎప్‌ దాడులు చేసి ఈ గ్రామంలోని ఒక బెల్టు షాపు నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.

తాజాగా ఇప్పుడు మరోసారి కూడా ఈ గ్రామంలో బెల్టు షాపులో మద్యం పట్టుబడింది. గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం అతడి వద్ద నుంచి 31 క్వార్టర్ల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుంది. నిందితుడిని కొత్తపట్నం పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్థన్‌ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడైనా మద్యం విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్‌షాపుల గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే 100కు ఫోన్‌ చేసి తెలియజేయాల్సిందిగా కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఎస్సైలు సుదర్శన్‌, శివరామయ్య, ఏఎస్సై షేక్‌ మహబూబ్‌ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా1
1/2

బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా2
2/2

బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement