పంచాయతీ ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు
కురిచేడు: అతివేగంతో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు పంచాయతీ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..బెంగళూరు నుంచి వినుకొండ వెళుతున్న వి కావేరి ట్రావెల్ బస్సు పాతపోలీసుస్టేషను వద్ద అతివేగంగా వెళుతూ పంచాయతీ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వీపర్ నందిగం ఇసాక్ కిందపడి గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో చెత్త వేసేందుకు వచ్చిన గ్రామస్తుడు తంగెళ్ల తలకు గాయమైంది. బస్సు అతివేగానికి భయాందోళనకు గురైన స్వీపర్లు బస్సును అడ్డుకొని నిలిపివేశారు. క్షతగాత్రులు నందిగం ఇసాక్‌ను వినుకొండ ఆస్పత్రికి తరలించారు.


