పనులు చేశాం..బిల్లులు ఇవ్వరా..?
రాచర్ల: చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అనుములపల్లె పంచాయతీ సర్పంచ్ సిరిగిరి రమేష్ సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, తాగునీటి పైపుల లీకేజీల మరమ్మతులు, వీధిలైట్లు, పారిశుధ్య పనులన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి సూచన మేరకే చేశానన్నారు. ఆ పనులకు సంబంధించి రూ.3.50 లక్షల బిల్లు మంజూరు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అనుములపల్లెలో తాగునీటి మోటార్లు మరమ్మతులకు గురై ఐదు రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు పడుతున్నారని చెప్పారు. సర్పంచ్‌తో కలిసి 20 మందికి పైగా గ్రామస్తులు మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అయితే కార్యాలయం ఎదుట నిరసనకు అనుమతి లేదని పోలీసులు సర్పంచ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కొంత సేపు కూర్చోపెట్టి ఇంటికి పంపించారని సర్పంచ్ రమేష్ తెలిపారు.
మండల పరిషత్ కార్యాలయం
ఎదుట సర్పంచ్ నిరసన


